Sarkaru Vaari Paata : మహేష్ సినిమాలో మరో హీరోయిన్.. ప్లాన్ చేంజ్ చేసిన పరశురామ్.. కీలక పాత్రలో..

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజాగా చిత్రం సర్కారు వారిపాట. ఈ సినిమాలో మహేష్ కు జోడీగా అందాల భామ కీర్తిసురేష్ నటిస్తుంది. గీతగోవిందం సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్న పరశురామ్..

Sarkaru Vaari Paata : మహేష్ సినిమాలో మరో హీరోయిన్.. ప్లాన్ చేంజ్ చేసిన పరశురామ్.. కీలక పాత్రలో..
Follow us
Rajeev Rayala

|

Updated on: Feb 22, 2021 | 7:05 PM

Sarkaru Vaari Paata movie : సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజాగా చిత్రం సర్కారు వారిపాట. ఈ సినిమాలో మహేష్ కు జోడీగా అందాల భామ కీర్తిసురేష్ నటిస్తుంది. గీతగోవిందం సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్న పరశురామ్ ఈసినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. బ్యాంకింగ్ రంగంలో జరిగే మోసాల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. తాజాగా దుబాయ్ షెడ్యూల్ ను పూర్తి చేసుకున్న ఈ చిత్రయూనిట్ గోవాకు పయనమయ్యారు.

ఇదిలా ఉంటే ఈసినిమాకు సంబంధించిన ఓ వార్త ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతుంది. ఈ సినిమాలో కీర్తిసురేష్ కాకుండా మరో హీరోయిన్ నటించబోతుందని తెలుస్తుంది. పరశురామ్ కథలో కొన్ని మార్పులు చేసాడంట.. దాంతో కథలో కీలక పాత్ర కోసం హీరోయిన్ ను వెతుకుతున్నాడట దర్శకుడు. అయితే కథను మలుపు తిప్పే క్యారెక్టర్ కోసం స్టార్ హీరోయిన్ ను ఎంపిక చేయబోతున్నాడట పరశురామ్. థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇక ఈ సినిమా షూటింగ్ నుంచి లీకైన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. మహేష్ ఈ సినిమాలో సరికొత్త లుక్ లో కనిపించనున్నాడు. మహేష్ కెరీర్ లో 27వ చిత్రంగా వస్తున్న ‘సర్కారు వారి పాట’ను 2022 సంక్రాంతికి విడుదల చేయనున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Krishna Tulasi Serial : వంటలక్కకు పోటీగా కృష్ణ తులసి.. రంగంలోకి దిగిన రాఘవేంద్ర.. రేటింగ్ లో సత్తా చూపిస్తుందా..!