వినూత్నంగా దర్శకదిగ్గజం కె విశ్వనాథ్ కు శుభాకాంక్షలు తెలిపిన అభిమానులు.. మురిసిపోయిన కళాతపస్వి
నాటి దర్శకుల్లో సాటిలేని వ్యక్తి కె విశ్వనాథ్. తెలుగు ప్రజలు కళాతపస్వి అంటూ ఆప్యాయంగా పిలుస్తుంటారు ఆయన్ని. ఆయన సినిమాలు ఎందరికో ఆదర్శం.
K. Viswanath : నాటి దర్శకుల్లో సాటిలేని వ్యక్తి కె విశ్వనాథ్. తెలుగు ప్రజలు కళాతపస్వి అంటూ ఆప్యాయంగా పిలుస్తుంటారు ఆయన్ని. ఆయన సినిమాలు ఎందరికో ఆదర్శం. సంస్కృతి , సంప్రదాయం, సహజత్వం ఊపిరిగా ఆయన తెరకెక్కించిన సినిమాలు ఆణిముత్యాలు. సాహిత్యానికి పెద్ద పీటవేస్తూ దర్శకత్వం వహించిన సినిమా సినీ ప్రేమికులను ఉలలాడించాయి.. సినీ వినీలాకాశంలో ఆయనో ధ్రువతార.. కోట్లాది గుండెలను తన సినిమాలతో అలరించిన గొప్ప దర్శకుడు. తెలుగు సినిమా గౌరవాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన మహోన్నత వ్యక్తి కాశీనాధుని విశ్వనాథ్. ఫిబ్రవరి 19న తన 91వ పుట్టిన రోజును జరుపుకున్నారు.
విశ్వనాథ్ బర్త్ డే సందర్భంగా మెగాస్టార్ చిరంజీవితో పాటు పలువురు ప్రముఖులు ఆయనకు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు.తాజాగా ఆయన అభిమానులు కళాతపస్వి పుట్టిన రోజు సందర్భంగా వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపారు. ఓ కేక్ లో విశ్వనాథ్ తెరకెక్కించిన అన్ని సినిమాలను ఉంచారు. విశ్వనాథ్ తీసిన సినిమాలన్నింటిని పొందుపరిచి సర్‌ప్రైజ్ ఇచ్చారు. అది చూసిన ఆయన ఎంతగానో మురిసిపోయారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Kalathapasvi K Viswanath gariki vinoothna reethilo puttinaroju subhakaankshalu theliyajesina abhimanulu pic.twitter.com/6oUjcVNwB1
— BARaju (@baraju_SuperHit) February 21, 2021