Karthikeya 2 : సినిమా టైటిల్ అనౌన్స్ చేసి నెలలు గడుస్తున్నా.. అప్‌డేట్ మాత్రం ఇవ్వడంలేదు..
యంగ్ హీరో నిఖిల్ సినిమాల విషయంలో ఆచితూచి ఆడుగులు వేస్తున్నాడు. విభిన్న మైన కథలను ఎంచుకుంటూ విజయాలను అందుకుంటున్నాడు. ఆ మధ్య చందు మొండేటి దర్శకత్వంలో కార్తికేయ సినిమాచూసి మంచి విజయాన్ని అందుకున్నాడు.
Karthikeya 2 movie : యంగ్ హీరో నిఖిల్ సినిమాల విషయంలో ఆచితూచి ఆడుగులు వేస్తున్నాడు. విభిన్న మైన కథలను ఎంచుకుంటూ విజయాలను అందుకుంటున్నాడు. చందు మొండేటి దర్శకత్వంలో కార్తికేయ సినిమా మంచి విజయాన్ని అందుకున్నాడు. అయితే ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కబోతుంది. త్వరలో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుందని తెలుస్తుంది. సినిమా కాన్సెప్ట్ వీడియోను ఆ మధ్య విడుదల చేసింది చిత్రయూనిట్. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా తెరకెక్కించనున్న ఈ సినిమాకి టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మాతలుగా వ్యవహరించనున్నారు. కాలభైరవ సంగీతం అందించనున్నారు. అయితే ఈ సినిమా అనౌన్స్ చేసి ఇన్ని రోజులవుతున్న ఇప్పటివరకు ఈ సినిమా గురించి ఎక్కడా ఎలాంటి అప్డేట్ లేదు. తాజాగా ఈ సినిమా కథ ఇదేనంటూ ఫిలిం నగర్ లో ఓ వార్త చక్కర్లు కొడుతుంది. కొన్ని వేల సంవత్సరాల క్రితం నాటి రహస్యం ఆధారంగా ఒక సరికొత్త విషయాన్ని చెప్పబోతున్నట్లు తెలుస్తుంది. ‘5118 ఏళ్ల క్రితం ముగిసిన ఒక యుగం. ఆ యుగ అనంత జ్ఞాన సంపద. అందులో దాగి ఉన్న ఒక రహస్యం. ఈ యుగంలో అన్వేషణ. స్వార్థానికి ఒకరు. సాధించడానికి ఒకరు. అతని సంకల్పానికి సాయం చేసినవారెవరు’ అనే వినూత్నమైన కాన్సెప్ట్‌తో ఈ సినిమా తెరకెక్కబోతుంది. ప్రస్తుతం నిఖిల్ సుకుమార్ రైటింగ్స్ లో ’18 పేజెస్’ అనే సినిమా చేస్తున్నాడు. పల్నాటి సూర్య ప్రతాప్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తుంది.
మరిన్ని ఇక్కడ చదవండి :
వినూత్నంగా దర్శకదిగ్గజం కె విశ్వనాథ్ కు శుభాకాంక్షలు తెలిపిన అభిమానులు.. మురిసిపోయిన కళాతపస్వి