Krishna Tulasi Serial : వంటలక్కకు పోటీగా కృష్ణ తులసి.. రంగంలోకి దిగిన రాఘవేంద్ర.. రేటింగ్ లో సత్తా చూపిస్తుందా..!

టాలీవుడ్ లో అగ్రదర్శకుడుగా ఉన్నప్పుడే శాంతి నివాసం అనే సీరియల్ కు రాఘవేంద్ర రావు దర్శకత్వం పర్యవేక్షణ బాధ్యతలు నిర్వహించారు. ఆ సీరియల్ తోనే రాజమౌళి దర్శకుడుగా వెలుగులోకి...

Krishna Tulasi Serial : వంటలక్కకు పోటీగా కృష్ణ తులసి.. రంగంలోకి దిగిన రాఘవేంద్ర.. రేటింగ్ లో సత్తా చూపిస్తుందా..!
Follow us
Surya Kala

|

Updated on: Feb 22, 2021 | 6:06 PM

Krishna Tulasi Serial : టాలీవుడ్ దర్శక దిగ్గజం, దర్శకేంద్రుడు కే. రాఘవేంద్రరావు గత కొంత కాలంగా దర్శకత్వానికి దూరంగా ఉంటున్నారు. అయితే టాలీవుడ్ లో అగ్రదర్శకుడుగా ఉన్నప్పుడే శాంతి నివాసం అనే సీరియల్ కు రాఘవేంద్ర రావు దర్శకత్వం పర్యవేక్షణ బాధ్యతలు నిర్వహించారు. ఆ సీరియల్ తోనే రాజమౌళి దర్శకుడుగా వెలుగులోకి వచ్చారు. దాదాపు దశాబ్ద కాలం తర్వాత మళ్ళీ ఓ తెలుగు టీవీ సీరియల్ కు రాఘవేంద్ర రావు దర్శకత్వం పర్యవేక్షణ బాధ్యతలు చేపట్టడం విశేషం..

ఆర్కే టెలీ షో ద్వారా జీ తెలుగు చానెల్‌లో ప్రసారం కానున్న ‘కృష్ణ తులసి’ సీరియల్‌కు కె.రాఘవేంద్రరావు దర్శక పర్యవేక్షణ చేయనున్నారు. ఈ సందర్భంగా రాఘవేంద్రరావు కృష్ణ తులసి అనేది ఒక స్ఫూర్తి దాయక మహిళకు చెందిన వైవిధ్యమైన జీవిత కధ అని చెప్పారు.. ఈ కథ తనను ఎంతగానో ఆకట్టుకుందని చెప్పారు.

సీరియల్‌లో కృష్ణతులసి పాత్ర తన హృదయానికి దగ్గరగా అనిపించిందని.. ఈ పాత్ర తప్పనిసరిగా తెలుగు ప్రేక్షకులకు నచ్చుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సీరియల్‌ జీ తెలుగులో ఈ రోజు నుంచి సాయంత్రం 6. 30 లకు ప్రసారం కానుంది.

శ్యామా అనే నిస్వార్థ మరియు ఆధ్యాత్మిక అమ్మాయి కథ కృష్ణ తులసి. ఆ మధురమైన గాత్రం వెనుక అంతులేని బాధ ఉంది. ఆ అమాయక చూపుల వెనుక ఊహించలేని గాధ ఉంది. ఆ తెల్లని మనసు వెనుక అలముకున్న నీడలు ఎన్నో. కుటుంబం కోసం తన గాత్రాన్ని తాకట్టు పెట్టింది. ఆ త్యాగమే శ్యామా జీవితం. అందాలని చూసి బంధాల్ని పెనవేసుకొనే ఈ లోకం లో గంధపు సువాసని పసిగట్టేది ఎవరు? ఇన్ని కష్టాల నడుమ కూడా శ్యామా తనని తానుగా ఇష్టపడే వ్యక్తి కోసం ఎదురుచూస్తుందని కృష్ణ తులసి పాత్రలోని ఔనత్యాన్ని పరిచయం చేసారు శ్యామాగా ఐశ్వర్య నటించింది.

అయితే నలుపు కాన్సెప్ట్ తో ఇప్పటికే వంటలక్క పాత్ర ప్రేక్షకులకు దగ్గరయింది. ఈ నేపథ్యంలో మళ్ళీ కృష్ణ తులసి లో శ్యామా గా మరో హీరోయిన్ నలుపు రంగు తో వస్తుంది. దీంతో కృష్ణ తులసి సీరియల్ ఎఫెక్ట్ కార్తీక దీపం పై పడుతుందా అనే టాక్ వినిపిస్తోంది. ఎందుకంటే రాఘవేంద్ర రావు పర్యవేక్షణలో శాంతి నివాసం అప్పట్లో ఓ సంచలనమే సృష్టించింది.. ఈ నేపథ్యంలో వంటలక్క కు శ్యామా పోటీనేనా అంటున్నారు. ఏ విషయమో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.. ! Also Read:

వాట్సాప్ ప్లేస్‌లో సందేశ్ యాప్‌ను లాంఛ్ చేసిన ప్రభుత్వం..ఎన్ని అదనపు పీచర్స్ ఉన్నాయో తెలుసా..!

కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు.. భారీ నష్టాలను చవిచూసిన మదుపర్లు..ఇలా ఎన్ని రోజులంటే..!