AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sandes App Launched : వాట్సాప్ ప్లేస్‌లో సందేశ్ యాప్‌ను లాంఛ్ చేసిన ప్రభుత్వం..ఎన్ని అదనపు పీచర్స్ ఉన్నాయో తెలుసా..!

మేక్ ఇన్ ఇండియా పిలుపులో భాగంగా అనేక మంది తమ తెలివి తేటలకు పదును పెడుతున్నారు.. ఇప్పటికే టిక్ టాక్ ప్లేస్ లో రూప్ సో వంటి యాప్ లను తెరమీదకు తెచ్చిసక్సస్ అందుకున్నారు. తాజాగా భారత ప్రభుత్వ సందేశ్ పేరిట ఓ నూతన యాప్‌ను లాంచ్..

Sandes App Launched : వాట్సాప్ ప్లేస్‌లో సందేశ్ యాప్‌ను లాంఛ్ చేసిన ప్రభుత్వం..ఎన్ని అదనపు పీచర్స్ ఉన్నాయో తెలుసా..!
Surya Kala
|

Updated on: Feb 22, 2021 | 5:24 PM

Share

Sandes App Launched : గాల్వన్ ఘటన తో చైనా కు చెందిన అనేక యాప్స్ ను భారత్ బ్యాన్ చేసింది. ఇక తాజాగా ప్రముఖ సోషల్ మీడియా వాట్సాప్ యాప్ భద్రత పై వస్తున్న వివాదాలు తెలిసిందే.. వినియోగదారుల గోప్యతకు ముప్పు అంటున్నారు. దీంతో భారత్ లో ఈ సోషల్ మీడియా వినియోగదారులకు వాటప్స్ యాప్ ను ఉపయోగించడం పై అనుమానులు కూడా నెలకొన్నాయి. అయితే ప్రధాన మంత్రి మోడీ భారత్ అభివృద్ధి కోసం ఇచ్చిన మేక్ ఇన్ ఇండియా పిలుపులో భాగంగా అనేక మంది తమ తెలివి తేటలకు పదును పెడుతున్నారు.. ఇప్పటికే టిక్ టాక్ ప్లేస్ లో రూప్ సో వంటి యాప్ లను తెరమీదకు తెచ్చిసక్సస్ అందుకున్నారు..

అయితే తాజాగా ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌కు పోటీగా భారత ప్రభుత్వ సందేశ్ పేరిట ఓ నూతన యాప్‌ను లాంచ్ చేసింది. వాట్సాప్‌లో ఉన్న ఫీచర్లతోపాటు ఇంకొన్ని ఫీచర్లను అదనంగా ఈ యాప్‌లో అందిస్తున్నారు. ఈ యాప్‌ను నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ తాజాగా ఆవిష్కరించింది.

సందేశ్ యాప్‌లో యూజర్ల డేటాకు పూర్తి రక్షణ ఉంటుంది. ఎందుకంటే ఈ యాప్ మేడిన్ ఇండియా కనుక ఇందులో స్టోర్ అయ్యే డేటా అంతా ఇండియాలోనే ఉంటుంది. కనుక యూజర్ల డేటాకు భద్రత లభిస్తుంది. అలాగే సందేశ్ యాప్‌లో బర్త్ డే, ప్రొఫెషనల్ వివరాలను కూడా ఎంటర్ చేసే అదనపు సౌకర్యాన్ని రూపొందించారు. ఇది వాట్సాప్ లో అవకాశం లేదు. ఈ సందేశ్ యాప్ ను ఫోన్ నెంబర్ తోనే లింక్ చేయాల్సిన అవసరం లేదు. కేవలం ఈ-మెయిల్ ఉన్నా చాలు, ఈ యాప్‌ను వాడుకోవచ్చు. అలాగే ఒకటికన్నా ఎక్కువ డివైస్‌లలో సందేశ్ యాప్‌ను ఉపయోగించవచ్చు. ఇదే అవకాశం వాట్సాప్‌కు లేదు.

ఇక వాట్సాప్‌లో ఉన్న బ్రాడ్ క్యాస్ట్ మెసేజెస్‌, గ్రూప్స్, ఇమేజ్‌ల షేరింగ్‌, వీడియో, ఎమోజీలు వంటి ఫీచర్లన్నీ సందేశ్ యాప్‌లోనూ లభిస్తున్నాయి. అలాగే చాట్ బాట్, లాగౌట్ ఫీచర్లను కూడా సందేశ్ యాప్ లో అందిస్తున్నారు. ఇవి వాట్సాప్‌లో అందుబాటులో లేవు. అందువల్ల సందేశ్ యాప్ వాట్సాప్‌కు పోటీ ఇస్తుందని నిపుణులు భావిస్తున్నారు. చూడాలి మరి వాట్సప్ ప్లేస్ లో భారతీయుల మనసులను ఈ సందేశ్ యాప్ ఏ రేంజ్ లో దోచుకుంటుందో..!

Also Read:

 ఓకే అడ్రస్‌తో ఏకంగా 70 పాస్‌పోర్టులు.. తీగ లాగితే కదులుతున్న డొంక.. షాకింగ్ విషయమేంటంటే?

త్వరలో గోవాకు పయనం కానున్న సర్కారు వారి పాట చిత్ర యూనిట్