సక్సెల్‌ఫుల్ డైరెక్టర్‌తో చేతులు కలపనున్న పవన్ కళ్యాణ్..? క్రేజీ కాంబినేషన్ సెట్ చేస్తోన్న దిల్‌రాజు..
Pawan Kalyan: టాలీవుడ్‌లో పవన్ కళ్యాణ్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పవర్ స్టార్ సినిమాకి సంబంధించి ఏ చిన్న వార్త అయినా సరే ట్రెండింగ్‌లో నిలుస్తుంది. రాజకీయాల కారణంగా కొన్ని రోజుల...

Pawan Kalyan: టాలీవుడ్‌లో పవన్ కళ్యాణ్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పవర్ స్టార్ సినిమాకి సంబంధించి ఏ చిన్న వార్త అయినా సరే ట్రెండింగ్‌లో నిలుస్తుంది. రాజకీయాల కారణంగా కొన్ని రోజుల పాటు సినిమాలకు దూరంగా ఉన్న పవన్ వకీల్‌సాబ్ చిత్రంతో మరోసారి ఇండస్ట్రీపై దండెత్తాడు. ఈ సినిమాతో మరోసారి తన స్టామినా ఏ మాత్రం తగ్గలేదని నిరూపించాడు పవన్. ఇక అభిమానులను ఫుల్ ఖుషీ చేస్తూ వరుస సినిమాలను ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే తాజా సమాచారం ప్రకారం టాలీవుడ్‌లో మరో క్రేజీ కాంబినేషన్ సెట్ అవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఎఫ్2 సినిమాతో ఒక్కసారిగా ఇండస్ట్రీని తనవైపు తిప్పుకున్న దర్శకుడు అనిల్ రావిపూడి పవన్‌ను డైరెక్ట్ చేయనున్నాడనేది సదరు వార్త సారాంశం. ఎఫ్2 అనంతరం మహేష్ బాబు హీరోగా సరిలేరు నీకెవ్వరుతో బంపర్ హిట్ కొట్టిన అనిల్ ప్రస్తుతం ఎఫ్3 సినిమాతో బిజీగా ఉన్నాడు. ఇక ఈసినిమా పూర్తికాగానే పవన్‌తో కొత్త సినిమా తెరకెక్కించనున్నాడని వార్తలు వస్తున్నాయి. ఈ క్రేజీ కాంబినేషన్‌ను ప్రముఖ నిర్మాత దిల్ రాజు సెట్ చేయనున్నాడని తెలుస్తోంది. ప్రస్తుతం పవన్ క్రిష్‌తో పాటు హరీష్ శంకర్‌తో సినిమాలు చేయనున్నాడు. ఈ రెండు సినిమాలు పూర్తయిన తర్వాత అనిల్‌తో చిత్రం సెట్స్ పైకి వెళుతుందని టాక్. మరి ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

Pawan Kalyan Anil Ravipudi
Also Read: Rashmika Mandanna: మిల్లీ సెకండ్లలో ప్రేమలో పడ్డానంటోన్న రష్మిక.. ఎవరితోనో తెలుసా.?
Actor Abbas: ఒకప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడు అబ్బాస్ ఇప్పుడు ఎలా ఉన్నాడో, ఏం చేస్తున్నాడో తెలుసా..
Malayalam movies in OTT platforms: తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంటున్న మలయాళ సినిమాలు..




