Rashmika Mandanna: మిల్లీ సెకండ్లలో ప్రేమలో పడ్డానంటోన్న రష్మిక.. ఎవరితోనో తెలుసా.?
Rashmika Mandanna: ఛలో సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది అందాల తార రష్మిక మందన్నా. వరుస సినిమాలతో తనదైన ముద్ర వేసిందీ చిన్నది. అనతి కాలంలో మహేష్‌బాబు, అల్లు అర్జున్ వంటి...
Rashmika Mandanna: ఛలో సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది అందాల తార రష్మిక మందన్నా. వరుస సినిమాలతో తనదైన ముద్ర వేసిందీ చిన్నది. అనతి కాలంలో మహేష్‌బాబు, అల్లు అర్జున్ వంటి బడా హీరోల సరసన నటించే అవకాశాన్ని సొంతం చేసుకుంటూ దుసుకెళుతోంది. ఇక కేవలం సినిమాలకు మాత్రమే పరిమితం కాకుండా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో నిత్యం టచ్‌లో ఉంటుందీ బ్యూటీ. సినిమాలతో పాటు వ్యక్తిగత విషయాలను ఎప్పటికప్పడు పంచుకునే రష్మిక తాజాగా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా తాను ప్రేమలో పడ్డానని చెప్పుకొచ్చింది.
రష్మిక తాజాగా తన జీవితంలోకి పెట్ డాగ్‌ను ఆహ్వానించింది. ఆ లిటిల్ డాగ్‌తో దిగిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన రష్మిక.. కరోనా లాంటి విపత్కర పరిస్థితిల్లోనూ నాకు ఆనందాన్ని పంచిన ఈ లిటిల్ పెట్‌ను మీకు పరిచయం చేస్తున్నా అంటూ పోస్ట్ చేసిన రష్మిక.. సాధారణంగా ప్రేమలో పడడానికి మూడు సెకండ్ల సమయంలో పడుతుందని చెబుతుంటారు. కానీ నేను మాత్రం కేవలం 0.3 మిల్లీ సెకన్లలో ప్రేమలో పడిపోయానని క్యాప్షన్ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. ఇక రష్మిక కెరీర్ విషయానికొస్తే ఈ అందాల తార ప్రస్తుతం.. అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతోన్న పుష్పతో పాటు, ఆడవాళ్లు మీకు జోహర్లు చిత్రాల్లో నటిస్తోంది. వీటితో పాటు బాలీవుడ్‌లోనూ ఎంట్రీ ఇవ్వనుందీ బ్యూటీ.
రష్మిక చేసిన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్..
View this post on Instagram
Also Read: Actor Abbas: ఒకప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడు అబ్బాస్ ఇప్పుడు ఎలా ఉన్నాడో, ఏం చేస్తున్నాడో తెలుసా..
Malayalam movies in OTT platforms: తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంటున్న మలయాళ సినిమాలు..