Vishnupriyaa Bhimeneni: విష్ణుప్రియ ఫేస్‌బుక్‌లో న్యూడ్ ఫొటోలు, వీడియోలు.. ఆరా తీయగా అసలు విషయం…
తన ఫేస్‌బుక్ స్టోరీలో అప్‌లోడ్ అయిన న్యూడ్ ఫోటోలపై స్పందించింది యాంకర్ విష్ణుప్రియ. అందర్నీ మనస్పూర్తిగా క్షమాపణలు కోరుతున్నట్లు తెలిపింది.

యాంకర్, నటి విష్ణుప్రియను ప్రత్యేకంగా పరిచయం పని లేదు. అబ్బాయిలకి ఈ అమ్మడు బాగా ఫేవరెట్. హీట్ పెంచే ఫోటోలు షేర్ చేస్తూ.. వారికి చెమటలు పట్టిస్తూ ఉంటుంది. తొలుత టీవీ కార్యక్రమాలతో ప్రేక్షకులకు దగ్గరైన ఈ భామ.. ఆపై సినిమాలపై ఎక్కువ ఫోకస్ పెట్టింది. ఇటీవల బిగ్ బాస్ ఫేమ్ మానస్‌తో కలిసి ఓ ప్రైవేట్ సాంగ్‌లో ఆడిపాడింది. ఈ భామకు సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో ఫాలోవర్స్ ఉన్నారు. అయితే ఇప్పుడు ఆ ప్లాట్‌ఫామ్సే ఆమెకు చిక్కులు తెచ్చిపెట్టాయి. ఊహించని విధంగా.. ఆమె ఫేస్‌బుక్ అకౌంట్ స్టోరీలో మహిళల న్యూడ్ ఫోటోలు కనిపించాయి. కొన్ని న్యూడ్ వీడియోస్ కూడా ఉన్నాయి. దీంతో నెటిజన్లు స్టన్ అయ్యారు. విష్ణు ప్రియ ఏంటి.. ఇలాంటి పోస్టులు పెట్టిందని అవాక్కయ్యారు.
తెలిసినవారు కొందరు ఆమెకే ఫోన్ చేసి డైరెక్ట్‌గా అడిగేశారు. దీంతో విష్ణుప్రియ ఫుల్ క్లారిటీ ఇచ్చేసింది. తన ఫేస్ బుక్ అకౌంట్ హ్యాక్ అయినట్లు వివరించింది. 3 నెలల క్రితమే తన ఖాతాను ఎవరో హ్యాక్ చేశారని.. తిరిగి అదుపులోకి తెచ్చుకునేందుకు ప్రయత్నించినా ఫలించడం లేదని తెలిపింది. ఆ పేజీని అన్‌ఫాలో చేసి.. రిపోర్ట్ కొట్టాలని సూచించింది. తన ఫేజీలో అడల్ట్ కంటెంట్ కనిపించడం వల్ల.. చాలామంది అసౌకర్యానికి గురయ్యారని.. అందుకే మనస్పూర్తిగా క్షమాపణలు కోరుతున్నట్లు తెలిపింది.
తన అకౌంట్ హ్యాక్ అయిన విషయాన్ని అందరికీ చెప్పాలని ఆమె అభిమానులను కోరింది. కాగా ఎక్కువగా హాట్ ఫోటోలతో నెట్టింట ట్రెండ్ అవుతూ ఉంటుంది విష్ణుప్రియ. తన బోల్డ్ ఫోటోలపై కూడా ఆమె క్లారిటీ ఇచ్చింది. తాను ఉన్నది గ్లామర్ ఇండస్ట్రీ అని.. గ్లామర్ ఒలకబోయకపోతే ఎక్కవకాలం కొనసాగలేమని కుండబద్దలు కొట్టేసింది.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..




