AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NBK107: బాలయ్య సినిమానుంచి అదిరిపోయే అప్డేట్.. టైటిల్ లాంచ్ ఎక్కడంటే..!

బాలయ్య నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ఎన్బీకే 107. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ నటిస్తోన్న సినిమా ఇది. అఖండ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత బాలకృష్ణ నుంచి వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

NBK107: బాలయ్య సినిమానుంచి అదిరిపోయే అప్డేట్.. టైటిల్ లాంచ్ ఎక్కడంటే..!
Nandamuri balakrishna 107 Movie
Rajeev Rayala
|

Updated on: Oct 19, 2022 | 5:29 PM

Share

నటసింహం నందమూరి బాలకృష్ణ సినిమా అంటే క్రేజ్ మాములుగా ఉండదు. ఆయన సినిమా వస్తుందంటే అభిమానులకు పండగే. బాలయ్య నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ఎన్బీకే 107. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ నటిస్తోన్న సినిమా ఇది. అఖండ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత బాలకృష్ణ నుంచి వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక బాలయ్య నటిస్తోన్న 107 సినిమాలో హీరోయిన్ గా అందాల భామ శ్రుతిహాసన్ నటిస్తుండగా వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్రలో నటించనున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మేకర్స్.

మోస్ట్ ఎవైటెడ్ మూవీ ఎన్బీకే 107 టైటిల్ లాంచ్ ఈ నెల 21న జరగనున్న సంగతి తెలిసిందే. ఈ వేడుకకు వేదికగా ఐకానిక్ ప్లేస్ కర్నూల్ కొండా రెడ్డి బురుజును ఎంపిక చేయడం విశిష్టతను సంతరించుకుంది. టాలీవుడ్‌లో తొలిసారిగా కొండా రెడ్డి బురుజు వేదికగా వేడుక జరుపుకుంటున్న చిత్రం ఇదే కావడం విశేషం. అక్టోబర్ 21, సాయంత్రం 8:15 టైటిల్ లాంచ్‌కి ముహూర్తం ఖరారు చేశారు. ఈ చిత్రంలో దునియా విజయ్, వరలక్ష్మి శరత్‌కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

బాలకృష్ణ ,గోపీచంద్ మలినేని చిత్రాలకు బ్లాక్ బస్టర్ ఆల్బమ్‌లను అందించిన సంగీత సంచలనం ఎస్ థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. రిషి పంజాబీ సినిమాటోగ్రఫర్ గా పని చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవిశంకర్ ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నారు. స్టార్ రైటర్ సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ అందించగా ఈ చిత్రానికి ఫైట్ మాస్టర్స్ గా రామ్-లక్ష్మణ్ పని చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి
Balakrishna

Balakrishna

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

పాక్ ఫ్యాన్స్‌కు ఇచ్చిపడేసిన వైభవ్ సూర్యవంశీ..
పాక్ ఫ్యాన్స్‌కు ఇచ్చిపడేసిన వైభవ్ సూర్యవంశీ..
ఆ స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ కొట్టేసిన లేటెస్ట్ సెన్సేషన్ భాగ్యశ
ఆ స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ కొట్టేసిన లేటెస్ట్ సెన్సేషన్ భాగ్యశ
ఫిబ్రవరి 13 నుంచి టాలీవుడ్ ప్రో లీగ్..
ఫిబ్రవరి 13 నుంచి టాలీవుడ్ ప్రో లీగ్..
పక్కింటోళ్ల నోటి దూలపై రూ. 62లక్షల దావా..యువతికి నెటిజన్ల నీరాజనం
పక్కింటోళ్ల నోటి దూలపై రూ. 62లక్షల దావా..యువతికి నెటిజన్ల నీరాజనం
విగ్రహాల రాజధానిగా అమరావతి: ప్రముఖ నేతల భారీ విగ్రహాల ఏర్పాటు
విగ్రహాల రాజధానిగా అమరావతి: ప్రముఖ నేతల భారీ విగ్రహాల ఏర్పాటు
‘సిక్కిం సుందరి’ని చూసి ఫిదా అయిన ఆనంద్‌ మహీంద్ర.. వైరల్‌ వీడియో
‘సిక్కిం సుందరి’ని చూసి ఫిదా అయిన ఆనంద్‌ మహీంద్ర.. వైరల్‌ వీడియో
మాజీ సీఎం KCRకు నోటీసులు ఇవ్వాలని సిట్ నిర్ణయం
మాజీ సీఎం KCRకు నోటీసులు ఇవ్వాలని సిట్ నిర్ణయం
సిరీస్ మధ్యలో 'మందు పార్టీ'.. శిక్షణకు ముగ్గురే.. అసలు కథ ఇదే..
సిరీస్ మధ్యలో 'మందు పార్టీ'.. శిక్షణకు ముగ్గురే.. అసలు కథ ఇదే..
ఈ ఏడాది టెన్త్‌ పబ్లిక్‌ పరీక్షలకు 6.23లక్షల విద్యార్థులు
ఈ ఏడాది టెన్త్‌ పబ్లిక్‌ పరీక్షలకు 6.23లక్షల విద్యార్థులు
ప్రపంచంలోని వెండి నిల్వలున్న టాప్ 5 దేశాలు.. భారతదేశం ఏ స్థానంలో
ప్రపంచంలోని వెండి నిల్వలున్న టాప్ 5 దేశాలు.. భారతదేశం ఏ స్థానంలో