AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: పాక్ అభిమానుల వికృత చేష్టలు.. సైలెంట్‌గా ఇచ్చిపడేసిన వైభవ్ సూర్యవంశీ..

Vaibhav Suryavanshi Booed by Pakistani Fans: పాకిస్తాన్ అభిమానుల క్రీడాస్ఫూర్తి లేని ప్రవర్తనను నెటిజన్లు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఓటమి ఎదురైనా టీమిండియా యంగ్ ప్లేయర్ వైభవ్ చూపించిన ఆత్మవిశ్వాసం, నిగ్రహం భవిష్యత్తులో అతను పెద్ద స్టార్ అవుతాడనడానికి నిదర్శనమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Video: పాక్ అభిమానుల వికృత చేష్టలు.. సైలెంట్‌గా ఇచ్చిపడేసిన వైభవ్ సూర్యవంశీ..
Vaibhav Suryavanshi Booed By Pakistani FansImage Credit source: x.com/MentionCricket
Venkata Chari
|

Updated on: Dec 23, 2025 | 4:40 PM

Share

Vaibhav Suryavanshi Booed by Pakistani Fans: దుబాయ్‌లో జరిగిన అండర్-19 ఆసియా కప్ 2025 ఫైనల్‌ మ్యాచ్‌ తీవ్ర ఉద్వేగాల మధ్య ముగిసింది. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ చేతిలో భారత్ ఓటమి పాలైనప్పటికీ, 14 ఏళ్ల భారత ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) ప్రవర్తన ఇప్పుడు అందరి ప్రశంసలు అందుకుంటోంది. మైదానం వెలుపల పాక్ అభిమానులు అతనిని హేళన చేసినా, అతను చూపించిన పరిణతి నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

అసలేం జరిగిందంటే?

ఫైనల్ మ్యాచ్‌లో పాకిస్థాన్ భారీ స్కోరు సాధించిన తర్వాత లక్ష్య ఛేదనలో వైభవ్ సూర్యవంశీ మెరుపు ఆరంభాన్ని ఇచ్చాడు. కేవలం 10 బంతుల్లో 3 సిక్సర్లు, ఒక ఫోర్‌తో 26 పరుగులు చేశాడు. అయితే, పాక్ బౌలర్ అలీ రజా బౌలింగ్‌లో అవుటైన తర్వాత ఇద్దరి మధ్య మైదానంలో వాగ్వాదం జరిగింది. రజా ‘సెండ్ ఆఫ్’ ఇవ్వగా, వైభవ్ తన షూ వైపు వేలు చూపిస్తూ (షూ కింద ఉంటారు అన్నట్లుగా) సైగలు చేస్తూ ధీటుగా సమాధానమిచ్చాడు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి: Video: 12 ఫోర్లు, 10 సిక్సర్లు.. 35 బంతుల్లో ఫాస్టెస్ట్ సెంచరీ.. ఇండోర్‌లో రోహత్ విధ్వంసం చూస్తారా..?

స్టేడియం వెలుపల పాక్ ఫ్యాన్స్ ఎగతాళి..

మ్యాచ్ ముగిసిన తర్వాత వైభవ్ స్టేడియం వెలుపల నడుచుకుంటూ వెళ్తుండగా, కొంతమంది పాకిస్థాన్ అభిమానులు అతడిని చుట్టుముట్టి పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ‘బూయింగ్’ (Booing) చేశారు. అతనిని రెచ్చగొట్టేలా అసభ్యకరమైన కామెంట్స్ కూడా చేశారు.

వైరల్ అవుతున్న వైభవ్ రియాక్షన్..

అంత మంది చుట్టుముట్టి హేళన చేస్తున్నా, 14 ఏళ్ల వైభవ్ ఏమాత్రం సహనం కోల్పోలేదు. వారితో గొడవ పడకుండా, ఎటువంటి రియాక్షన్ ఇవ్వకుండా చాలా గంభీరంగా, ప్రశాంతంగా అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్లిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, “14 ఏళ్ల వయసులో ఇంతటి నిగ్రహం ఉండటం అద్భుతం” అంటూ భారత అభిమానులు ప్రశంసిస్తున్నారు.

ఇది కూడా చదవండి: గల్లీ క్రికెట్ ఆడటానికి కూడా సరిపోడు.. కట్‌చేస్తే.. గంభీర్ మొండిపట్టుతో టీ20 ప్రపంచ కప్ జట్టులోకి..

టోర్నీలో వైభవ్ ప్రదర్శన:

ఈ టోర్నీలో వైభవ్ సూర్యవంశీ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. యూఏఈపై కేవలం 95 బంతుల్లో 171 పరుగులు చేశాడు. టోర్నీలో మొత్తం 261 పరుగులు సాధించి భారత టాప్ స్కోరర్‌గా నిలిచాడు.

ఐపీఎల్ 2025 వేలంలో కూడా 1.10 కోట్లకు రాజస్థాన్ రాయల్స్ ఇతనిని దక్కించుకోవడం విశేషం.

పాక్ అభిమానుల క్రీడాస్ఫూర్తి లేని ప్రవర్తనను నెటిజన్లు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఓటమి ఎదురైనా వైభవ్ చూపించిన ఆత్మవిశ్వాసం, నిగ్రహం భవిష్యత్తులో అతను పెద్ద స్టార్ అవుతాడనడానికి నిదర్శనమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..