Anchor Suma: సుమక్క సినిమా కష్టాలు.. ‘జయమ్మ పంచాయితీ’ కోసం తగ్గేదే లే…

బుల్లితెర లేడీ సూపర్‌స్టార్ సుమ.. త్వరలో వెండితెరపై సందడి చేయబోతున్న విషయం తెలిసిందే.  ఆమె ప్రధాన పాత్రలో "జయమ్మ పంచాయితీ" అనే సినిమా తెరకెక్కుతోంది.

Anchor Suma: సుమక్క సినిమా కష్టాలు.. 'జయమ్మ పంచాయితీ' కోసం తగ్గేదే లే...
Anchor Suma
Follow us
Ram Naramaneni

|

Updated on: Nov 12, 2021 | 5:26 PM

బుల్లితెర లేడీ సూపర్‌స్టార్ సుమ.. త్వరలో వెండితెరపై సందడి చేయబోతున్న విషయం తెలిసిందే.  ఆమె ప్రధాన పాత్రలో “జయమ్మ పంచాయితీ” అనే సినిమా తెరకెక్కుతోంది. ఇటీవల ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్‌ను టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ రిలీజ్ చేశారు. ఆ లుక్ ఇప్పుడు నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది. సుమ రోలు దంచగానే.. రోలు కూడా బద్దలయ్యేలా ఉన్న మూవీ మోషన్ పోస్టర్‌‌ బాగా బజ్ క్రియేట్ చేసింది. విజయ్ కుమార్ ఈ సినిమాను తెరకెక్కిస్తుండగా…. బలగా ప్రకాశ్ నిర్మిస్తున్నారు. చాలా ఏళ్ల తర్వాత సుమ ఆచి తూచి ఎంచుకున్న ప్రాజెక్ట్ అవ్వడంతో.. ఇందులో మంచి కంటెంట్ ఉంటుందని జనాలు నమ్ముతున్నారు. కాగా ఈ సినిమా కోసం సుమ తన ఆహార్యంపై కూడా ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా జిమ్‌లో వర్కువుట్స్ చేస్తోంది. అందుకోసం స్పెషల్ ట్రైనర్‌ని నియమించుకుంది. తాజాగా జిమ్‌లో చెమటలు చిందిస్తోన్న ఓ వీడియోను సుమ ఇన్‌స్టాలో షేర్ చేసింది.

View this post on Instagram

A post shared by Suma K (@kanakalasuma)

‘2వ సెట్ డంబెల్స్ ఎత్తిన తర్వాత నా చేతులు ఎంత పెయిన్‌తో ఉంటాయో వర్ణించలేను.. ఆపమంటాడేమో అని నా ట్రైనర్ రాహుల్ వైపు చూస్తూ ఉంటా.. కానీ అతను మాత్రం ఆ మాట చెప్పడు’ అని సుమ రాసుకొచ్చింది.

ప్రజంట్ సుమక్క జిమ్ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఓ వైపు టెలివిజన్ షోలు, మరోవైపు సినిమా ఆడియో పంక్షన్లు, ప్రీ రిలీజ్ ఫంక్షన్లతో క్షణం తీరిగా లేకుండా ఉన్న సుమ.. నటిగా కూడా తన సత్తా చాటబోతుంది.

Also Read: Viral Video: తునాతునకలైన లారీ.. చక్రాలు మాత్రమే మిగిలాయ్.. డ్రైవర్ పరుగో పరుగు

 మత్తు చిత్తు చేసుద్ది… మందు ఎక్కువైంది.. మాడు పగిలింది..