Upasana: సమంత అద్భుతమైన వ్యక్తి.. ఆమెది నిజమైన ప్రేమ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ఉపాసన..
Upasana About Samantha: రామ్‌చరణ్ భార్యగానే కాకుండా ఓ మహిళా వ్యాపారవేత్తగా తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు ఉపాసన. ఈ మహిళా వ్యాపారవేత్త ప్రస్తుతం అపోలో లైఫ్‌కు వైస్ చైర్‌పర్సన్‌గా..
Upasana About Samantha: రామ్‌చరణ్ భార్యగానే కాకుండా ఓ మహిళా వ్యాపారవేత్తగా తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు ఉపాసన. ఈ మహిళా వ్యాపారవేత్త ప్రస్తుతం అపోలో లైఫ్‌కు వైస్ చైర్‌పర్సన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తాఉన్నారు. అంతేకాకుండా బీ పాజిటివ్ అనే మ్యాగజైన్‌కు ఎడిటర్‌గా కూడా పనిచేస్తున్నారు. ఇలా క్షణం తీరిక లేకుండా గడిపే ఉపాసన ఇటీవల ఓ వార్త సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె తన వ్యక్తిగత వివరాలతో పాటు పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
ఈ సందర్భంగా ఉపాసన మాట్లాడుతూ.. ‘చాలా మంది మహిళలు తమ ఆరోగ్యాన్ని విస్మరిస్తూ పక్కవారి ఆరోగ్యం కోసం పనిచేస్తుంటారు. కానీ ఇంట్లో ఉండే మహిళ ఒక్కసారి అనారోగ్యానికి గురైతే మొత్తం కుటుంబం అనారోగ్యంపాలైనట్లే. మహిళలకు నేను చెప్పదలుచుకుంది ఒక్కటే.. ముందు మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి అప్పుడే మీ కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది. అంతేకాకుండా ఒక్క మహిళలలే కాకుండా ఎవరైనా ఖాళీగా ఉండకూడదు. ఏదో ఒకటి నేర్చుకోవడం లేదా.. పని చేస్తుండాలి’ అంటూ చెప్పుకొచ్చారు.
ఇక నటి సమంతతో తనకున్న అనుబంధాన్ని పంచుకున్న ఉపాసన.. సమంతలో సాయం చేసే గుణం ఉందని చెప్పుకొచ్చారు. సమంత తనకు ఎన్నో విషయాల్లో సహాయం అందించారని చెబుతూ.. సమంతది నిజమైన ప్రేమ అని తెలిపారు. ఇక సమంత ఆర్టికల్స్ ఎడిట్ చేసేంత వరకు తనకు మాంసం తినే అలాటుందని, తాను తెలంగాణ బిడ్డనని, దసరా వంటి పండుగల సమయంలో మాంసం తినేదానిని కానీ.. సమంత ఆర్టికల్స్ ఎడిట్ చేసిన తర్వాత మాంసం తినడం చాలా వరకు తగ్గించానని ఉపాసన చెప్పుకొచ్చారు.
Kashmir Valley: జమ్ముకశ్మీర్‌లో పాక్ ఉగ్రవాదుల లెక్క తేలింది.. ఇక ఏరివేతే మిగిలింది..
RRR: నాటు నాటు పాటకు బామ్మ అదిరిపోయే స్టెప్పులు.. వీడియో వైరల్..