Tollywood: గుర్తుపట్టారా ఈ అమ్మాయిని.. మాటలతోనే కోటలు కట్టేస్తుంది
ఆమె మాటల పుట్ట. పంచ్‌లు ఈజీగా పేల్చేస్తుంది. ఆమె మాటల్లో హ్యూమర్ ఉంటుంది. మాటలతోనే కోటలు కట్టేస్తుంది. బుల్లితెర మహారాణి అని నిరూపించుకుంది. ఇప్పుటికే చాలామందికి ఓ ఐడియా వచ్చేసింది. ఈ రోజు తన బర్త్ డే. మీరు కూడా విషెస్ చెప్పేయండి..

సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు.. అన్ని సినిమాల వార్తలే. సెలబ్రిటీల ఫోటోలే. ఇక సినిమా వాళ్ల చిన్నప్పటి ఫోటోలు కూడా ఇప్పుడు బాగా వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా వాళ్ల బర్త్ డేస్ లేదా ఏదైనా అకేషన్ ఉన్నప్పుడు వాటిని వైరల్ చేస్తుంటారు ఫ్యాన్స్. ఇప్పుడు మీ ముందుకు ఓ ఫేమస్ పర్సన్ చిన్నప్పటి ఫోటో తీసుకొచ్చాం. తన మాటల పుట్ట. పంచ్‌లకు కేరాఫ్ అడ్రస్. ఏ ఛానల్ ఓపెన్ చేసినా తనే ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఒకప్పడు నటిగా కూడా అలరించింది. ఇప్పుడు స్టార్ యాంకరమ్మగా తెలుగునాట స్థిరపడిపోయింది. అవును అండీ పైన ఫోటోలో ఉన్నది మన సుమక్కే. మార్చి 22న సుమ కనకాల పుట్టిన రోజు. దీంతో ఆమె అరుదైన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
మాటలతోనే కోటలు కట్టే ఈ యాంకరమ్మకు 49 సంవత్సరాలు వచ్చాయి అంటే నమ్ముతారా..? బుల్లితెర మహారాణి ఇంకో ఏడాది అయితే హాఫ్ సెంచరీ కొట్టేస్తుంది. అయినా ఆమె ఎనర్జీలో నో డిఫరెన్స్. సినిమాలు సిల్వర్ స్క్రీన్‌పై సందడి చేసేముందు జరిగే ఫంక్షన్లలో మాత్రం ఆమె గాత్రం వినిపించాల్సిందే. స్టేజిని చూస్తే ఎక్కడ లేని ఎనర్జీ వస్తుందని సుమే గతంలో చెప్పింది.
యాంకరింగ్ అంటే సుమ. సుమ అంటే యాంకరింగ్.. కానీ ఈ బుల్లితెర క్వీన్.. ఓ యాంకర్‌ను చూసి జెలసీగా ఫీలయ్యారని గతంలో చెప్పిందండోయ్. యాంకర్ అనసూయను చూసినప్పుడు తనంత ఎత్తు లేనని చిన్నపాటి కుల్లు ఫీలయ్యారట సుమ. ఇక సుమ భర్త రాజీవ్ కనకాల నటుడిగా కొనసాగుతున్నారు. సుమ తనయుడు రోషన్.. ఇటీవలే బబుల్ గమ్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. చాన్నాళ్ల తర్వాత ‘జయమ్మ పంచాయతీ’ సినిమాతో 2022లో వెండితెరపై కనిపించింది సుమ. కానీ ఆ సినిమా అనుకున్న స్థాయిలో ఆడలేదు. ఇంకెందుకు ఆలస్యం.. తెలుగువాళ్ల ఫేవరెట్, ఎవర్‌గ్రీన్ యాంకర్‌కు మీరు కూడా హ్యాపీ బర్త్ డే చెప్పేయండి.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
