Arundhathi Nair : వారం రోజులుగా మృత్యువుతో హీరోయిన్ పోరాటం.. స్పందించని ఇండస్ట్రీ..
సుమారు గంటపాటు రోడ్డుపై అపస్మారకస్థితిలో పడి ఉన్న ఆమెను స్థానికులు చెన్నైలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది. ఇప్పటికే అరుంధతి చికిత్స కోసం పెద్ద మొత్తంలో ఖర్చు చేశామని.. తన సోదరి ప్రాణాన్ని కాపాడేందుకు సాయం చేయాలంటూ సోషల్ మీడియా వేదికగా కోరింది. ఇండస్ట్రీలో నటీనటులు సాయం చేయాలంటూ వేడుకుంటుంది. అందుకు బ్యాంకు వివరాలను కూడా వెల్లడించింది.

కోలీవుడ్ హీరోయిన్ అరుంధతి నాయర్ ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురై తీవ్ర గాయాలతో చికిత్స పొందుతుంది. మార్చి 14న చెన్నైలో ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆమె.. ఆ తర్వాత తన సోదరుడితో కలిసి బైక్ పై ఇంటికి తిరిగి వస్తుండగా.. తిరువనంతపురంలోని చెన్నై, కోవలం బైపాస్ రోడ్డుపై గుర్తు తెలియని వాహనం వారిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అరుంధతి తల కు తీవ్ర గాయాలయ్యాయి. సుమారు గంటపాటు రోడ్డుపై అపస్మారకస్థితిలో పడి ఉన్న ఆమెను స్థానికులు చెన్నైలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది. ఇప్పటికే అరుంధతి చికిత్స కోసం పెద్ద మొత్తంలో ఖర్చు చేశామని.. తన సోదరి ప్రాణాన్ని కాపాడేందుకు సాయం చేయాలంటూ సోషల్ మీడియా వేదికగా కోరింది. ఇండస్ట్రీలో నటీనటులు సాయం చేయాలంటూ వేడుకుంటుంది. అందుకు బ్యాంకు వివరాలను కూడా వెల్లడించింది. అరుంధతి చికిత్సకు సాయం చేయాలంటూ ఆమె స్నేహితులు .. కోలీవుడ్ నటీనటులు కోరారు.
తన సోదరి చికిత్సకు ఎలాగైనా సాయం చేయాలంటూ అరుంధతి చెల్లెలు ఆర్తి మీడియా ముందుకు వచ్చింది. సాయం అడిగితే తమను ట్రోల్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ఆసుపత్రి బిల్లులు చెల్లించడానికి కూడా డబ్బుల్లేవని.. ఇప్పుడు ఆసుపత్రి చుట్టూ పరుగులు పెడుతున్నామని.. కానీ అలాంటి సమయంలో తమ గురించి ట్రోల్ చేస్తున్నారని అన్నారు. ప్రస్తుతం తన సోదరికి బ్రెయిన్ సర్జరీ చేయించాలని.. అందుకు త్రివేండ్రంలోని అనంతపూరి ఆసుపత్రిలో చేర్పించామని చెప్పుకొచ్చింది. ఇప్పుడు ఆమెకు వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నామని.. ఇప్పటికే రూ. 5 లక్షలకు పైగా ఖర్చు చేశామని.. ట్రీట్మెంట్ పూర్తయ్యేసరికి ఇంకా ఎంత ఖర్చు అవుతుందో చెప్పలేమని .. సాయం చేయాలంటూ కోరింది.అయితే అరుంధతికి సాయం చేయాలని గత నాలుగైదు రోజులుగా ఆమె కుటుంబసభ్యులు, స్నేహితులు సోషల్ మీడియా ద్వారా వేడుకుంటున్న ఇప్పటివరకు ఇండస్ట్రీ పెద్దల నుంచి ఎలాంటి సాయం.. సంప్రదింపులు జరగలేదని తెలిపారు.
అరుంధతి పరిస్థితిని వివరించినా.. సాయం చేయాలని కోరిన ఇప్పటివరకు తమిళ సినీ పరిశ్రమ నుంచి ఎవరూ ముందుకు రాలేదని ఆమె స్నేహితురాలు రమ్య జోసెఫ్ తెలిపారు.సర్జరీకి బిల్లులు చెల్లించేందుకు తాము నిధుల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించామని… దాతలు ఎవరైనా సాయం చేయాలని కోరింది. అరుంధతి తమిళ్ సినీ పరిశ్రమలో అనేక చిత్రాల్లో నటించింది. విలక్షణ నటుడు విజయ్ ఆంటోని నటించిన సైతాన్ సినిమాలో కథానాయికగా నటించింది. 2018లో ఒటైక్కోరు ఆకవంకన్ సినిమాతో మలయాళంలో అడుగుపెట్టింది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
