AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss Sonu Srinivas Gowda: 8 ఏళ్ల చిన్నారిని అక్రమంగా దత్తత.. బిగ్‏బాస్ బ్యూటీని అరెస్ట్ చేసిన పోలీసులు..

దీంతో బెంగుళూరులోని బాదరహళ్లి పోలీసులు ఈరోజు సోను శ్రీనివాస్ గౌడను అదుపులోకి తీసుకున్నారు. పిల్లలను దత్తత తీసుకోవడంలో అనేక ప్రక్రియలు ఉంటాయి. కానీ సోనూ ఎలాంటి రూల్స్ పాటించలేదని.. ఆ పాప తల్లిదండ్రులకు అనేక సౌకర్యాలు కల్పించి.. అక్రమంగా ఆ పాపను దత్తత తీసుకుందంటూ ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆమెపై చర్యలు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

Bigg Boss Sonu Srinivas Gowda: 8 ఏళ్ల చిన్నారిని అక్రమంగా దత్తత.. బిగ్‏బాస్ బ్యూటీని అరెస్ట్ చేసిన పోలీసులు..
Sonu Srinivas Gowda
Rajitha Chanti
|

Updated on: Mar 22, 2024 | 3:13 PM

Share

కన్నడ బిగ్‏బాస్ ఓటీటీ సీజన్ 1 కంటెస్టెంట్ సోను శ్రీనివాస్ గౌడను బెంగుళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. 8 ఏళ్ల చిన్నారిని ఎలాంటి నియమాలు పాటించకుండా.. అక్రమంగా దత్తత తీసుకోవడమే ఆమె అరెస్ట్‏కు కారణమని తెలుస్తోంది. చిన్నారులను దత్తత తీసుకునే రూల్స్ కూడా ఆమె బ్రేక్ చేసిందని..కేవలం సామాజిక సానుభూతి కోసమే ఆమె ఆ చిన్నారిని తెచ్చుకుందంటూ ఆమె పై ఫిర్యాదులు నమోదయ్యాయి. దీంతో బెంగుళూరులోని బాదరహళ్లి పోలీసులు ఈరోజు సోను శ్రీనివాస్ గౌడను అదుపులోకి తీసుకున్నారు. పిల్లలను దత్తత తీసుకోవడంలో అనేక ప్రక్రియలు ఉంటాయి. కానీ సోనూ ఎలాంటి రూల్స్ పాటించలేదని.. ఆ పాప తల్లిదండ్రులకు అనేక సౌకర్యాలు కల్పించి.. అక్రమంగా ఆ పాపను దత్తత తీసుకుందంటూ ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆమెపై చర్యలు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అంతేకాకుండా సదరు చిన్నారితో సోను రీల్స్, యూట్యూబ్ వీడియోస్ చేస్తుందని అన్నారు.

దత్తత తీసుకునే వ్యక్తికి.. ఆ చిన్నారికి కనీసం 25 ఏళ్ల వయసు వ్యత్సాసం ఉండాలి. కానీ సోనూకు.. ఆ అమ్మాయికి వయసు వ్యత్సాసం అంతగా లేదు. అలాగే పిల్లల గుర్తింపును.. వారి పేరు.. ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడానికి వీలు లేదు.. కానీ సోనూ అలాంటి నియమాలేవి పాటించకుండానే దత్తత తీసుకున్నారు. అయితే 8 ఏళ్ల చిన్నారిని అక్రమంగా దత్తత తీసుకుని.. కేవలం సమాజంలో పేరు ప్రఖ్యతలు, సానుభూతి కోసమే ఆమె ఆ చిన్నారిని తనవద్దకు తీసుకువచ్చిందంటూ కర్ణాటక రాష్ట్ర బాలల సంరక్షణ విభాగం అధికారిణి గీత ఫిర్యాదు చేశారు. జేజే చట్టం కింద బాదరహళ్లి పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడంతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు.

సోనూ మాట్లాడుతూ.. తనకు తెలిసినంత వరకు దత్త నియమాలు పాటించానని అన్నారు. ఆ చిన్నారిని తన ఆపార్ట్మెంట్ కింద చూశానని.. అప్పుడు తనకు ఓ చాక్లెట్ ఇవ్వగా… తనను ఇంటికి తీసుకెళ్లమని కోరిందని సోనూ గతంలో తన యూట్యూబ్ ఛానల్ లో దత్తతకు సంబంధించిన వీడియో షేర్ చేశారు. అలాగే ఆ చిన్నారికి దత్తతకు ముందే చైన్ ఇచ్చానని.. ఆ చిన్నారి తల్లిదండ్రులను సంప్రదించిన తర్వాతే దత్తత కార్యక్రమం జరిగిందని తెలిపింది. చట్టబద్ధంగా ఆ చిన్నారిని దత్తత తీసుకోవడానికి కనీసం 3 నెలల సమయం పడుతుంది. ఆమె పేరెంట్స్ అంగీకరించారు. ఇంకా చట్టపరమైన చర్యలు కొనసాగుతున్నాయి అని సోనూ తెలిపింది. ‘బిగ్ బాస్ కన్నడ సీజన్ 9’ ప్రారంభానికి ముందు, ‘బిగ్ బాస్ OTT’ జరిగింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.