Tabu: 24 ఏళ్ల తరువాత మళ్లీ చాందిని బార్ లో టబు.! ఈసారి న్యూ లోక్ తో..
24 ఏళ్ల క్రితం బాలీవుడ్‌లో సెన్సేషన్క్రియేట్ చేసిన సినిమా చాందిని బార్. టబు లీడ్ రోల్‌లో తెరకెక్కిన ఈ సినిమాకు మధుర్ బండార్కర్ దర్శకుడు. స్టార్ హీరోయిన్‌గా మంచి ఫామ్‌లో ఉన్న టైమ్‌లోనే ఈ సినిమాలో బార్ గర్ల్‌గా నటించారు టబు. ఇప్పుడు మరోసారి అదే క్యారెక్టర్‌లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 2001లో రిలీజ్ అయిన సూపర్ హిట్ క్రైమ్ డ్రామా చాందిని బార్. మధుర్ బండార్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సెన్సేషన్ క్రియేట్ చేసింది.