- Telugu News Photo Gallery Naga Chaitanya and Sai Pallavi starrer Thandel movie shooting in Hyderabad see photos
Thandel: శరవేగంగా నాగచైతన్య తండేల్ షూటింగ్.. ఫొటోలు వైరల్
అక్కినేని నాగచైతన్య, సాయిపల్లవి జంటగా దేశభక్తి అంశాలతో కూడిన పల్లెటూరి ప్రేమకథా చిత్రం 'తాండేల్'. చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది.
Updated on: Mar 22, 2024 | 3:15 PM

అక్కినేని నాగచైతన్య, సాయిపల్లవి జంటగా దేశభక్తి అంశాలతో కూడిన పల్లెటూరి ప్రేమకథా చిత్రం 'తాండేల్'. చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది.

గీతా ఆర్ట్స్ పతాకంపై చందూ మొండేటి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది. బన్నీ వాసు నిర్మించగా మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు.

తాండేల్ సెట్స్ నుండి తెరవెనుక దృశ్యాలు, నటీనటుల స్నేహపూర్వక సంబంధాలకు సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఒక ఫోటోలో చందూ మొండేటి అల్లు అరవింద్ కు ఒక సన్నివేశం గురించి వివరించగా, మరొకటి బన్నీ వాసు, నాగచైతన్య, చందూ మధ్య చర్చలు కొనసాగుతున్నాయి.

నాగచైతన్య, సాయిపల్లవి ఇద్దరూ డీగ్లామరైజ్డ్ అవతారాల్లో తమ పాత్రలకు తగ్గట్టు కనిపిస్తారు. నటీనటుల అప్పియరెన్స్ దగ్గర్నుంచి వారి బాడీ లాంగ్వేజ్, యాస వరకు ప్రతి అంశంలో పర్ఫెక్షన్ ఉండేలా తీర్చిదిద్దుతున్నారు మేకర్స్.

ఈ కీలక ప్రాజెక్టును దర్శకుడు చందూ మొండేటి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు. త్వరలోనే అదిరిపోయే అప్డేట్స్ రాబోతున్నాయని మేకర్స్ ప్రకటించారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.



