Anchor Anasuya: లెస్బియన్స్ గురించి అనసూయకు నెటిజన్ సూటిప్రశ్న.. షాకింగ్ రిప్లై ఇచ్చిన యాంకరమ్మ..
వరుస చిత్రాలతో ఎంత బిజీగా ఉన్నా.. అటు సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్. ఎప్పటికప్పుడు ఫ్యామిలీ ఫోటోస్ షేర్ చేయడమే కాకుండా.. ఫాలోవర్లతో ముచ్చటిస్తుంది. అలాగే తనపై నెట్టింట ట్రోల్స్ చేసే వారికి తన స్టైల్లో కౌంటరిస్తుంది.
బుల్లితెరపై ఉన్న అందాల యాంకరమ్మలలో అనసూయ భరద్వాజ్ ఒకరు. కొన్నేళ్లుగా జబర్దస్త్ కామెడీ షోతో ప్రేక్షకులను అలరించిన ఆమె.. ప్రస్తుతం వెండితెరపై తన నటనతో ప్రశంసలు అందుకుంటుంది. రంగస్థలం సినిమాతో నటిగా విమర్శకులను మెప్పించిన ఆమె.. ఇప్పుడు వరుస చిత్రాలతో బిజీగా మారింది. కొద్ది రోజులుగా డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తోన్న పుష్ప 2 చిత్రీకరణలో పాల్గొంటుంది అనసూయ. వరుస చిత్రాలతో ఎంత బిజీగా ఉన్నా.. అటు సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్. ఎప్పటికప్పుడు ఫ్యామిలీ ఫోటోస్ షేర్ చేయడమే కాకుండా.. ఫాలోవర్లతో ముచ్చటిస్తుంది. అలాగే తనపై నెట్టింట ట్రోల్స్ చేసే వారికి తన స్టైల్లో కౌంటరిస్తుంది.
తాజాగా మరోసారి ఓ నెటిజన్‌కు షాకింగ్ ఆన్సర్ ఇచ్చింది. లెస్బిసియన్స్ , గే గురించి అడిగిన ఓ నెటిజన్ ప్రశ్నకు ఊహించని రిప్లై ఇచ్చింది. దీంతో అనసూయ రిప్లై చూసి నెటిజన్స్ ఆశ్చర్యపోతున్నరాు. ఇంతకీ ఏం జరిగిందో తెలుసుకుందామా.
తాజాగా ఇన్ స్టాలో ఫాలోవర్లతో ముచ్చటించింది అనసూయ. ఈ క్రమంలో ఓ నెటిజన్ చాలా తెలివిగా.. లెస్బియన్స్, గేల గురించి ప్రశ్నించాడు. మీరు నిజంగా మెట్చ్యూర్డ్, లిబరల్ ఉమెన్ అయితే నా ప్రశ్నకు సమాధానం చెప్పండి. మీకు లెస్బియన్స్‌తో అలాంటి అనుభవాలు ఎదురయ్యాయా? అని ఓ నెటిజన్ అనసూయకు ప్రశ్నించగా.. ఆమె స్పందిస్తూ.. మా ఫ్యామిలీ, ఫ్రెండ్స్ లో చాలా మంది గే లు ఉన్నారు. అయితే పర్సనల్‌గా నాకు లెస్బియన్ ఎక్స్పీరియన్స్ మాత్రం కాలేదు. కానీ ఆన్ లైన్ మాత్రం చాలాసార్లు ఆ అనుభవాన్ని ఫేస్ చేశాను అంటూ రిప్లై ఇచ్చింది. అనసూయ ఇచ్చిన సమాధానం ఇప్పుడు తెగ వైరలవుతుంది. అయితే అనసూయ ఆన్సర్ చూసి ఆశ్చర్యపోతున్నారు నెటిజన్స్.
View this post on Instagram
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.