Anasuya: నచ్చినట్లు డ్రెస్ వేస్తే బోల్డ్‌గా ఉన్నట్లు కాదు.. అలా ఉంటే విలువలు కోల్పోయినట్లా..? అనసూయ..
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సెలబ్రెటీలలో యాంకర్ అనసూయ భరద్వాజ్ ఒకరు. తాజాగా తన డ్రెస్సింగ్ స్టైల్ పై వస్తున్న ట్రోల్స్ పై స్పందిస్తూ ఇన్ స్టాలో ఓ పోస్ట్ చేసింది. ఇద్దరు పిల్లల తల్లి అయినంత మాత్రాన తన వ్యక్తిత్వాన్ని కోల్పోకూడదని అన్నారు.

యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరంలేదు. బుల్లితెరపై కెరీర్ స్టార్ట్ చేసిన ఆమె ఇప్పుడు సినీరంగంలో బిజీ నటిగా మారిపోయింది. రంగస్థలం సినిమాతో నటిగా ప్రశంసలు అందుకుంది. దీంతో టాలీవుడ్ లో బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో అలరిస్తుంది. కానీ సోషల్ మీడియాలో మాత్రం నిత్యం ఏదోక విషయంతో వార్తలలో నిలుస్తుంది. ముఖ్యంగా ఆమ డ్రెస్సింగ్ స్టైల్ పై ఎక్కువగా ట్రోల్స్ వస్తుంటాయి. ఇద్దరు బిడ్డల తల్లి అయినప్పటికీ గ్లామర్ డ్రెస్సులు వేసుకోవడం ఏంటని విమర్శిస్తుంటారు. తాజాగా తనపై వస్తున్న ట్రోల్స్ పై స్పందిస్తూ సుధీర్ఘ పోస్ట్ చేసింది అనసూయ. తల్లి అయ్యాక మనల్ని మనం వదిలేసుకోవాలా ? ప్రశ్నిస్తూ ఓపెన్ లెటర్ షేర్ చేసింది.
ఇవి కూడా చదవండి..
ఒక్క యాడ్‌తో ఫేమస్ అయ్యింది.. హీరోయిన్లకు మించిన క్రేజ్.. ఈ అమ్మడు ఇప్పుడేలా ఉందో తెలుసా.. ?
“నన్ను ఎవరైనా విమర్శించినా చాలా వరకు మౌనంగానే ఉంటున్నాను. కానీ నాకు నచ్చినట్లు నేను బతుకుతున్నప్పుడు నా జీవన శైలినే విమర్శిస్తుంటే స్పందించాల్సిన అవసరం ఉంది. సోషల్ మీడియాలో కొంతమంది నన్ను టార్గెట్ చేస్తూ వీడియోస్ చేస్తున్నారు. అందులో ఎక్కువగా మహిళలే నన్ను లక్ష్యంగా చేసుకుంటున్నారు. వారందరూ నాకు తెలియదు. అయినా నన్ను వ్యక్తిగతంగా విమర్శిస్తున్నారు. నేను ఒక మహిళను.. ఇద్దరు పిల్లల తల్లిని. కానీ నా స్టైల్, గ్లామర్, ధైర్యాన్ని వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించే డ్రెస్సులు ధరించడాన్ని నేను ఎంజాయ్ చేస్తాను. ఇలా కనిపించడమే నాకు నచ్చుతుంది. కానీ నేను ఓ తల్లిగా ప్రవర్తించడం లేదని అంటున్నారు. తల్లి అయ్యాక మన నిజమైన స్వరూపాన్ని వదిలేసుకోవాలా ? అని నేను అడుగుతున్నాను..
ఇవి కూడా చదవండి.. Actress: అప్పుడు పద్దతిగా.. ఇప్పుడు గ్లామర్ బ్యూటీగా.. సెకండ్ ఇన్నింగ్స్‌లో అందాల రచ్చ..
నా భర్త, పిల్లలు, నా కుటుంబం నేను ఎలా ఉన్నా అంగీకరిస్తారు. ప్రేమిస్తారు. నన్ను సపోర్ట్ చేస్తుంటారు. నాకు అది చాలు .ఇంత ఓపెన్ గా ఉండడం కొంతమందికి కొత్తగా అనిపించవచ్చు. అయినా పర్లేదు. ఒకరి ఛాయిస్ ను చెడుగా ప్రభావంగా చూడకండి. నా పిల్లలు నన్ను గౌవరంతో, బాధ్యత ఉన్న మహిళగానే చూస్తున్నారు. బోల్డ్ గా ఉండడం అంటే అగౌరవంగా ఉండడం కాదు. నాకు నచ్చిన విధంగా డ్రెస్ వేసుకోవడం వల్ల నేను నా విలువలు కోల్పోయానని అర్థం కాదు. నన్ను ఫాలో అవ్వమని నేను అనడం లేదు. ఇదొక్కటే మార్గమని నేను చెప్పడం లేదు. మీకు నచ్చినట్లు మీరు బతికినట్టే.. నా జీవితాన్ని నాకు నచ్చిన స్టైల్లో బతికే హక్కు ఉంది. నేను ప్రేమతో, ధైర్యంగా, స్వేచ్ఛతో బతుకుతున్నాను. అదే సమయంలో ఇతరులను గౌరవించడం మర్చిపోను ” అంటూ తన పోస్టులో తెలిపారు.
ఇవి కూడా చదవండి.. Actress : గ్లామర్ ఫోటోలతో మెంటలెక్కిస్తోన్న హీరోయిన్.. అందాలు ఫుల్లు.. ఆఫర్స్ నిల్లు..
View this post on Instagram
ఇవి కూడా చదవండి. Actress : మహేష్ బాబుతో ఫస్ట్ మూవీ.. ఇండస్ట్రీలో చక్రం తిప్పిన హీరోయిన్.. కట్ చేస్తే.. నేషనల్ అవార్డ్..







