Allu Arha: నటనపై ఆసక్తి ఉంటే అర్హ పాప హైట్స్ అందుకుంటుంది.. ఎందుకంటే..?
పన్నెండేళ్ల వయసులో బాలక్రిష్ణుడి పాత్రలో నటించి మెప్పించారు శ్రీదేవి. సీఎస్ రావు డైరెక్ట్ చేసిన యశోద క్రిష్ణ మూవీకి ఆమె...
పన్నెండేళ్ల వయసులో బాలక్రిష్ణుడి పాత్రలో నటించి మెప్పించారు శ్రీదేవి. సీఎస్ రావు డైరెక్ట్ చేసిన యశోద క్రిష్ణ మూవీకి ఆమె ఒక స్పెషల్ ఎస్సెట్ అయ్యారు. గోపికమ్మల్ని మాయ చేసే చిలిపి క్రిష్ణుడిగా.. కంసుడిని చంపే గంభీర క్రిష్ణుడిగా ఆ క్యారెక్టర్‌ని సంపూర్ణం చేశారామె. కట్‌చేస్తే.. ఇండియన్ గ్లామర్ ఇండస్ట్రీని ఏలిన అతిలోక సుందరిగా అవతరించారు శ్రీదేవి. అంతకుముందు బ్లాక్‌అండ్ వైట్ శకంలో సీ నారాయణ్‌రావు డైరెక్ట్ చేసిన మైథలాజికల్ మూవీ భక్తప్రహ్లాదలో టైటిల్ రోల్ చేసి భళా అనిపించారు రోజారమణి. హిరణ్యకశ్యపుడికి దీటుగా నడిచే ప్రహ్లాదుడి పాత్రకు కరెక్ట్ ఆప్షన్ అనిపించారు రోజారమణి. తర్వాత.. ఆమె కూడా నాలుగు భాషల్లో బిజీయెస్ట్ ఆర్టిస్ట్ అయ్యారు.
బాల్యంలో మేల్ క్యారెక్టర్లు చేయడమే కాదు.. ఈ ఇద్దరమ్మాయిలూ ఎస్‌వీ రంగారావు లాంటి లెజెండరీ యాక్టర్లతో నటనలో ఢీకొట్టారు. తెలుగు సినిమా చరిత్రను తవ్వితే కనిపించే ఈ సాలిడ్ ఫ్యాక్ట్స్‌ని రీకాల్ చేసుకుంటోంది గుణశేఖర్ టీమ్. శాకుంతలం మూవీలో భరతుడి పాత్రలో నటించబోతున్న అల్లు అర్హ… శ్రీదేవి-రోజారమణి క్లబ్‌లో చేరబోతోంది అంటూ జోస్యం చెబుతున్నారు. అర్హ పాప దగ్గర ఆ రేంజ్‌లో టాలెంట్ వుందని కూడా నమ్ముతోంది ఐకాన్ స్టార్ ఫ్యాన్ క్లబ్. లెట్స్ వెయిట్ అండ్ సీ.
Also Read: ఆ అపవాదును పూర్తిగా తుడిచిపెట్టేసిన దర్శకధీరుడు.. ఈ డైరెక్టర్స్ మాత్రం లైన్ తప్పారు