AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Allu Arjun: చిరంజీవి, మహేష్ , విజయ్ దేవరకొండ ఇప్పుడు బన్నీ.. ఐకాన్ స్టార్ చేతికి మరో బ్రాండ్..

'పుష్ప 2' విడుదలకు మరికొద్ది రోజులు మాత్రమే సమయం ఉంది. అయితే అల్లు అర్జున్ దాని నుండి ఒక రోజు విరామం తీసుకున్నాడని సమాచారం. ఓ యాడ్ షూట్ కోసం బన్నీ బ్రేక్ తీసుకున్నాడట.

Allu Arjun: చిరంజీవి, మహేష్ , విజయ్ దేవరకొండ ఇప్పుడు బన్నీ.. ఐకాన్ స్టార్ చేతికి మరో బ్రాండ్..
Allu Arjun
Rajeev Rayala
|

Updated on: Nov 01, 2024 | 12:50 PM

Share

పుష్ప 2 విడుదల తేదీ మార్చిన విషయం తెలిసిందే. పుష్ప ముందుగా డిసెంబర్ 6న రావాల్సి ఉంది. ఇప్పుడు డిసెంబర్ 5న విడుదల కానుంది. ఈ సినిమా కోసం అభిమానులంతా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ ఇంకా పూర్తి కాలేదని తెలుస్తోంది. దీంతో పాటు ‘పుష్ప 2’ డ్యాన్స్‌ నంబర్‌ను కూడా చిత్రీకరించాల్సి ఉంది. ఇందుకోసం బాలీవుడ్ బ్యూటీని రంగంలోకి దింపుతున్నారని గుసగుస. ఆమె ఎవరో కాదు క్రేజీ బ్యూటీ శ్రద్ధా కపూర్‌. ఈ అమ్మడు పుష్ప 2లో స్పెషల్ సాంగ్ చేస్తుందని అంటున్నారు. ‘పుష్ప 2’ విడుదలకు మరికొద్ది రోజులు మాత్రమే సమయం ఉంది. అయితే అల్లు అర్జున్ దాని నుండి ఒక రోజు విరామం తీసుకున్నాడని సమాచారం. ఓ యాడ్ షూట్ కోసం బన్నీ బ్రేక్ తీసుకున్నాడట.

నిజానికి అల్లు అర్జున్ ఇప్పటికే పలు బ్రాండ్ ప్రమోషన్స్ లో పాల్గొన్న విషయం తెలిసిందే.. సినిమాపైనే కాకుండా ప్రమోషన్‌పైనా దృష్టి సారిస్తున్నారు. ఇక ఇప్పుడు థమ్సప్ కు అల్లు అర్జున్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించనున్నాడని తెలుస్తోంది. ఈ యాడ్ షూట్ కోసమే బన్నీ బ్రేక్ తీసుకున్నాడట. ఇప్పటికే థమ్సప్ కు మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేష్ బాబు, అల్లు అర్జున్ బ్రాండ్ అంబాసిడర్లుగా చేశారు. ఇప్పుడు ఇది ఐకాన్ స్టార్ చేతికి వెళ్ళింది.

ఈ యాడ్ ను పుష్ప సినిమా ప్రమోషన్‌ సందర్భంగా విడుదల చేయనున్నారు.  కాగా పుష్ప 2లో శ్రద్ధా కపూర్ పాటను ఇంకా చిత్రీకరించలేదని కొన్ని రోజుల క్రితం వార్తలు వచ్చాయి. నవంబర్ 4 నుంచి దీని షూటింగ్ ప్రారంభం కానుందని అంటున్నారు.. అందుకే దర్శకుడు సుకుమార్ సినిమా ప్రమోషన్‌లో పెద్దగా కనిపించారు అని అంటున్నారు. అల్లు అర్జున్ మాత్రమే కమాండ్ తీసుకోనున్నాడట. ఐటమ్ సాంగ్ పోస్ట్ ప్రొడక్షన్ పనులను సుకుమార్ చేయనున్నారు. దీంతో పాటు సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులపై కూడా దృష్టి పెట్టనున్నారు. ‘పుష్ప 2’లో స్టార్ యాక్టర్ వాయిస్ ఓవర్ ఉంటుందని కూడా చెబుతున్నారు. దీంతో ‘పుష్ప 3’కి హింట్ ఇస్తారని టాక్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us