AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సమ్మర్ హీట్ నుంచి ఉపశమనానికి అదిరిపోయే రీఫ్రెష్మెంట్.. చెరుకురసం, ఐస్‌క్రీమ్ కాంబో తిన్నారా!

చెరుకురసం అంటేనే వేసవిలో ఒక అమృతం. తక్షణ శక్తిని ఇవ్వడంలో దీనికి సాటి లేదు. అదే రసంతో ఐస్‌క్రీమ్ చేస్తే.. ఆ చల్లదనం, తీపిదనం కలిపి ఇచ్చే కిక్కే వేరు. బయట దొరికే ఐస్‌క్రీమ్స్ లో ప్రిజర్వేటివ్స్ ఉంటాయి, కానీ మనం ఇంట్లో చేసుకునే ఈ వెరైటీ ఐస్‌క్రీమ్ ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది.

సమ్మర్ హీట్ నుంచి ఉపశమనానికి అదిరిపోయే రీఫ్రెష్మెంట్.. చెరుకురసం, ఐస్‌క్రీమ్ కాంబో తిన్నారా!
Sugarcane Juice Ice Cream.jpg
Nikhil
|

Updated on: Mar 25, 2026 | 6:50 AM

Share

ప్రస్తుతం ఎండలు మండుతున్నాయి. బయట అడుగుపెడితే చాలు, భానుడి భగభగలకు జనం అల్లాడిపోతున్నారు. ఈ వేసవి తాపం నుంచి ఉపశమనం పొందడానికి మనం రకరకాల శీతల పానీయాలు, ఐస్‌క్రీమ్‌లను ఆశ్రయిస్తుంటాం. అయితే, ఎప్పుడూ తినే వెనిలా, చాక్లెట్ ఫ్లేవర్లు బోర్ కొట్టాయా? అయితే ఈసారి కొత్తగా, స్వచ్ఛమైన ప్రకృతి సిద్ధమైన ‘చెరుకురసం ఐస్‌క్రీమ్’ ప్రయత్నించండి. వినడానికే వింతగా ఉన్నా, దీని రుచి మాత్రం అద్భుతం. ఇంట్లోనే సహజంగా, ఎటువంటి కృత్రిమ రంగులు లేకుండా ఈ ఐస్‌క్రీమ్ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం.

కావలసిన పదార్థాలు

  • తాజా చెరుకురసం: 2 కప్పులు (మార్కెట్ నుండి తెచ్చిన వెంటనే వాడటం ఉత్తమం)
  • ఫ్రెష్ క్రీమ్ లేదా విప్పింగ్ క్రీమ్: 1 కప్పు
  • కండెన్స్‌డ్ మిల్క్: అర కప్పు (మీ తీపికి తగినట్లుగా)
  • నిమ్మరసం: 1 టీస్పూన్ (పులుపు కోసం)
  • అల్లం రసం: కొద్దిగా (మంచి ఫ్లేవర్ కోసం)
  • ఉప్పు: చిటికెడు

తయారీ విధానం

  • రసం సిద్ధం చేయడం : ముందుగా చెరుకురసాన్ని వడకట్టుకుని అందులో నిమ్మరసం, అల్లం రసం, చిటికెడు ఉప్పు కలపాలి. ఇది ఐస్‌క్రీమ్‌కు ఒక రకమైన ‘మసాలా చెరుకురసం’ ఫ్లేవర్‌ను ఇస్తుంది.
  • క్రీమ్ విప్పింగ్ : ఒక వెడల్పాటి గిన్నెలో చల్లని ఫ్రెష్ క్రీమ్ తీసుకుని, అది చిక్కగా, ప్లఫ్ఫీగా అయ్యే వరకు బ్లెండర్‌తో బాగా గిలకొట్టాలి.
  • మిక్సింగ్ : ఇప్పుడు అందులో కండెన్స్‌డ్ మిల్క్ వేసి మరోసారి కలిపాక, సిద్ధం చేసుకున్న చెరుకురసాన్ని కూడా పోసి ఎక్కడా ఉండలు లేకుండా సాఫ్ట్‌గా కలిపేయాలి.
  • ఫ్రీజింగ్ : ఈ మిశ్రమాన్ని ఒక ఎయిర్ టైట్ బాక్స్‌లో పోసి, సుమారు 7 నుంచి 8 గంటల పాటు డీప్ ఫ్రీజర్‌లో ఉంచాలి. ఐస్‌క్రీమ్ పైన ఐస్ ముక్కలు పేరుకోకుండా ఉండటానికి బాక్స్ పైన అల్యూమినియం ఫాయిల్ పెట్టడం మంచిది.

బయట దొరికే ఐస్‌క్రీమ్స్‌లో షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. కానీ ఇందులో చెరుకులోని సహజమైన తీపి ఉండటం వల్ల ఇది శరీరానికి తక్షణ గ్లూకోజ్‌ను అందిస్తుంది. ఎండలో తిరిగి వచ్చిన వారికి ఇది ఒక అద్భుతమైన ఎనర్జీ బూస్టర్‌లా పనిచేస్తుంది. ఈ వేసవిలో మీ పిల్లలకు కొత్తగా ఏదైనా తినిపించాలనుకుంటే ఈ ‘చెరుకురసం ఐస్‌క్రీమ్’ బెస్ట్ ఆప్షన్. చల్లచల్లని ఈ స్వీట్ ట్రీట్‌తో ఎండ దెబ్బ నుంచి సేదదీరండి. పైన కొద్దిగా పుదీనా ఆకులు లేదా డ్రై ఫ్రూట్స్ చల్లి సర్వ్ చేస్తే ఆ మజానే వేరు!

Follow Us
అమ్మవారికి ఇష్టమైన శ్రావణ మాస ప్రసాదం.. ఇలా చేస్తే తప్పక దీవెనే
అమ్మవారికి ఇష్టమైన శ్రావణ మాస ప్రసాదం.. ఇలా చేస్తే తప్పక దీవెనే
గ్రహణానికి ముందే జాగ్రత్త.. గర్భిణీలు పాటించాల్సిన నియమాలు ఇవే
గ్రహణానికి ముందే జాగ్రత్త.. గర్భిణీలు పాటించాల్సిన నియమాలు ఇవే
వరంగల్‌కు రెండో అతిపెద్ద ప్రభుత్వ కేన్సర్ హాస్పిటల్‌.. ఆరోగ్యశాఖ
వరంగల్‌కు రెండో అతిపెద్ద ప్రభుత్వ కేన్సర్ హాస్పిటల్‌.. ఆరోగ్యశాఖ
శ్రీలంకపై  డబుల్ సెంచరీ బాదిన రికార్డ్ వీరులు వీరే
శ్రీలంకపై  డబుల్ సెంచరీ బాదిన రికార్డ్ వీరులు వీరే
300లకు పైగా సినిమాలు.. 66 ఏళ్లకే ఆత్మహత్య..
300లకు పైగా సినిమాలు.. 66 ఏళ్లకే ఆత్మహత్య..
ఒక ఫీల్డింగ్ కోచ్ కోసం టీమిండియా క్రికెటర్ల కన్నీళ్లు!
ఒక ఫీల్డింగ్ కోచ్ కోసం టీమిండియా క్రికెటర్ల కన్నీళ్లు!
ఈ 3 భారతీయ నగరాల్లో దొరికే స్ట్రీట్ ఫుడ్‌కు ప్రపంచమే ఫిదా!
ఈ 3 భారతీయ నగరాల్లో దొరికే స్ట్రీట్ ఫుడ్‌కు ప్రపంచమే ఫిదా!
డిగ్రీ ప్రవేశాలకు ఆన్‌లైన్ కౌన్సెలింగ్ షెడ్యూల్ 2026 విడుదల
డిగ్రీ ప్రవేశాలకు ఆన్‌లైన్ కౌన్సెలింగ్ షెడ్యూల్ 2026 విడుదల
కీలక గ్రహాల అనుకూలత.. వారికి ఆర్థిక, రుణ సమస్యల నుంచి విముక్తి!
కీలక గ్రహాల అనుకూలత.. వారికి ఆర్థిక, రుణ సమస్యల నుంచి విముక్తి!
రోజూ చపాతీలు తింటున్నా బరువు తగ్గట్లేదా? కారణమిదే..
రోజూ చపాతీలు తింటున్నా బరువు తగ్గట్లేదా? కారణమిదే..
క్రేజీ డిసెంబర్‌.. హాలీవుడ్ మూవీస్‌తో బిగ్ ఫైట్‌
క్రేజీ డిసెంబర్‌.. హాలీవుడ్ మూవీస్‌తో బిగ్ ఫైట్‌
అనుకున్న దానికంటే ఆలస్యం.. విజయ్ దేవరకొండ విషయంలోనే ఎందుకలా..?
అనుకున్న దానికంటే ఆలస్యం.. విజయ్ దేవరకొండ విషయంలోనే ఎందుకలా..?
‘నా బిడ్డకు కొత్త జీవితాన్ని ఇచ్చారు’.. వీడియో
‘నా బిడ్డకు కొత్త జీవితాన్ని ఇచ్చారు’.. వీడియో
కదులుతున్న రైలు కింద పడబోయిన వ్యక్తి.. రెప్పపాటులో కాపాడిన మహిళా
కదులుతున్న రైలు కింద పడబోయిన వ్యక్తి.. రెప్పపాటులో కాపాడిన మహిళా
అమరావతికి ఆధ్యాత్మిక శోభ.. 123 అడుగుల భారీ కార్తికేయ విగ్రహం రెడీ
అమరావతికి ఆధ్యాత్మిక శోభ.. 123 అడుగుల భారీ కార్తికేయ విగ్రహం రెడీ
అన్నీ ఆగస్ట్‌లోనే.. టాలీవుడ్‌కు స్పెషల్ మంత్..!
అన్నీ ఆగస్ట్‌లోనే.. టాలీవుడ్‌కు స్పెషల్ మంత్..!
ఆఫర్ వచ్చినప్పుడు ఫ్లాప్ ఇచ్చారు.. ఇప్పుడేమో ఆఫర్స్ కోసం..
ఆఫర్ వచ్చినప్పుడు ఫ్లాప్ ఇచ్చారు.. ఇప్పుడేమో ఆఫర్స్ కోసం..
ఆర్మీ ఇంటెలిజెన్స్ బిగ్ ఆపరేషన్.. గుట్టు రట్టు!
ఆర్మీ ఇంటెలిజెన్స్ బిగ్ ఆపరేషన్.. గుట్టు రట్టు!
ఇదే నా చివరి మాట.. ఆర్నెల్లలో విగ్రహం పెట్టండి.. నా మాటకు అడ్డొస్
ఇదే నా చివరి మాట.. ఆర్నెల్లలో విగ్రహం పెట్టండి.. నా మాటకు అడ్డొస్
మాంసం ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన చికెన్, గుడ్ల ధరలు!
మాంసం ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన చికెన్, గుడ్ల ధరలు!