AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఉప్పు Vs చక్కెర.. పెరుగులో ఏది వేసుకుంటే మంచిది..? అసలు నిజం ఇదీ..

వేసవిలో పెరుగు, మజ్జిగ వంటి పదార్థాలు మన ఆహారంలో అంతర్భాగంగా మారిపోతాయి. అయితే పెరుగును తీసుకునే పద్ధతిని బట్టి దాని పోషక విలువలు మారుతుంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కొందరు ఉప్పుతో కూడిన మజ్జిగను ఇష్టపడితే, మరికొందరు తీపి లస్సీని ఇష్టపడతారు. అసలు జీర్ణక్రియ మెరుగుపడాలంటే ఉప్పు వాడాలా? లేక చక్కెర వాడాలా? అనేది తెలుసుకుందాం..

ఉప్పు Vs చక్కెర.. పెరుగులో ఏది వేసుకుంటే మంచిది..? అసలు నిజం ఇదీ..
Curd With Sugar Vs Salt
Krishna S
|

Updated on: Mar 25, 2026 | 6:55 AM

Share

ఎండలు మండిపోతున్నాయి. ఈ వేసవి తాపాన్ని తట్టుకోవడానికి మనమందరం పెరుగు, మజ్జిగ, లస్సీ వంటి పానీయాలను ఆశ్రయిస్తాం. ఇవి శరీరానికి చలువ చేస్తాయన్నది నిజం. అయితే పెరుగును చక్కెరతో కలిపి తీసుకోవాలా లేక ఉప్పుతోనా? అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. మీ శరీర పరిస్థితిని బట్టి ఏది ఉత్తమమో ఇప్పుడు తెలుసుకుందాం.

జీర్ణక్రియ కోసం ఉప్పు పెరుగు

మీరు జీర్ణ సంబంధిత సమస్యలతో బాధపడుతుంటే పెరుగులో కొద్దిగా ఉప్పు కలుపుకోవడం శ్రేయస్కరం. ఉప్పు కలిపిన పెరుగు జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. శరీర ఉష్ణోగ్రతను తగ్గించడంలో సహాయపడుతుంది. బరువు తగ్గాలనుకునే వారికి కూడా ఇది మంచి ఎంపిక. అయితే రక్తపోటు సమస్య ఉన్నవారు ఉప్పు కలిపిన పెరుగును పరిమితంగానే తీసుకోవాలి.

తక్షణ శక్తి కోసం చక్కెర పెరుగు

వేసవిలో చాలా మందికి ఆకలి తగ్గిపోతుంది. దీనివల్ల నీరసం ఆవహిస్తుంది. అటువంటి సమయంలో పెరుగులో చక్కెర లేదా బెల్లం కలుపుకుని తింటే అద్భుతమైన ఫలితం ఉంటుంది. ఇది శరీరానికి తక్షణ శక్తిని ఇస్తుంది. అలాగే పెరుగులోని మంచి బ్యాక్టీరియాను చక్కెర సురక్షితంగా ఉంచుతుంది, ఇది మన పేగు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మధుమేహం ఉన్నవారు చక్కెర కలిపిన పెరుగుకు దూరంగా ఉండటం మంచిది.

మంచి బ్యాక్టీరియా కథేంటి?

పెరుగులో ఉప్పు కలిపితే అందులోని లాక్టోబాసిల్లస్ వంటి మంచి బ్యాక్టీరియా చనిపోతుందని ఒక వాదన ఉంది. అయితే మితంగా ఉప్పు వాడుతూ, వెంటనే తీసుకోవడం వల్ల పెద్దగా నష్టం ఉండదు. కానీ పోషక విలువల పరంగా చూస్తే చక్కెర లేదా బెల్లం కలపడం వల్ల బ్యాక్టీరియా మరింత చురుగ్గా ఉండి జీర్ణవ్యవస్థకు తోడ్పడుతుంది.

పెరుగును ఎలా తీసుకోవాలనేది మీ రుచి, మీ ఆరోగ్య పరిస్థితిపై ఆధారపడి ఉంటుంది. మీకు ఎసిడిటీ ఉంటే ఉప్పుతో, నీరసంగా ఉంటే చక్కెరతో తీసుకోవడం ఉత్తమం. ఏది ఏమైనా.. పెరుగు వల్ల మీకు ఏవైనా ఆరోగ్య సమస్యలు ఎదురైతే మాత్రం వెంటనే వైద్యుడిని సంప్రదించడం మర్చిపోవద్దు.

Follow Us
నేను కాస్టింగ్ కౌచ్ ఎదుర్కొన్నా.. కొందరు కమిట్మెంట్స్ అడిగారు
నేను కాస్టింగ్ కౌచ్ ఎదుర్కొన్నా.. కొందరు కమిట్మెంట్స్ అడిగారు
పండుగ సమయంలో బహుమతిగా ఇవ్వడానికి బెస్ట్ బ్లూటూత్‌ స్పీకర్ ఇదే!
పండుగ సమయంలో బహుమతిగా ఇవ్వడానికి బెస్ట్ బ్లూటూత్‌ స్పీకర్ ఇదే!
రసగుల్లా గొంతులో ఇరుక్కుని 8 ఏళ్ల బాలుడు మృతి!
రసగుల్లా గొంతులో ఇరుక్కుని 8 ఏళ్ల బాలుడు మృతి!
'లైఫ్‌లో క్లారిటీ తప్పనిసరి.. తప్పు జరిగితే ఫుల్‌స్టాప్ పెట్టాలి'
'లైఫ్‌లో క్లారిటీ తప్పనిసరి.. తప్పు జరిగితే ఫుల్‌స్టాప్ పెట్టాలి'
అప్పుడు తెలుగులో క్రేజీ హీరోయిన్.. కట్ చేస్తే మాజీ సీఎం భార్య..
అప్పుడు తెలుగులో క్రేజీ హీరోయిన్.. కట్ చేస్తే మాజీ సీఎం భార్య..
టీ20 క్రికెట్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ చేసింది ఎవరో తెలుసా ?
టీ20 క్రికెట్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ చేసింది ఎవరో తెలుసా ?
సెమీకండక్టర్ల రంగంలో భారత్ సరికొత్త చరిత్ర
సెమీకండక్టర్ల రంగంలో భారత్ సరికొత్త చరిత్ర
నఖ్వీని గెంటెయడానికి బీసీసీఐ మాస్టర్ ప్లాన్
నఖ్వీని గెంటెయడానికి బీసీసీఐ మాస్టర్ ప్లాన్
160కిపైగా సినిమాలు.. స్టార్ హీరోలతో జతకట్టిన అందాల తార..
160కిపైగా సినిమాలు.. స్టార్ హీరోలతో జతకట్టిన అందాల తార..
హైదరాబాదీలు మర్చిపోయిన నీలోఫర్ కథ.. ఆ హాస్పిటల్ వెనుక అసలు స్టోరీ
హైదరాబాదీలు మర్చిపోయిన నీలోఫర్ కథ.. ఆ హాస్పిటల్ వెనుక అసలు స్టోరీ