AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Price Today: కుప్పకూలుతున్న బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే..

Gold Price Today: బంగారం, వెండి ధరలు కూప్పకూలుతున్నాయి. మీడియా నివేదికల ప్రకారం, గత 40 ఏళ్లలో బంగారం ధరలు ఇంత భారీగా పడిపోవడం ఇదే మొదటిసారి. ఇరాన్‌తో అమెరికా-ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న యుద్ధమే బంగారం ధరలలో ఈ గణనీయమైన తగ్గుదలకు కారణమని..

Gold Price Today: కుప్పకూలుతున్న బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే..
Gold Rate Today
Subhash Goud
|

Updated on: Mar 25, 2026 | 6:25 AM

Share

Gold Price Today: మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో బుధవారం బంగారం, వెండి ధరలు తగ్గుతున్నాయి. మంగళవారం అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు కూడా తగ్గాయి. కామెక్స్ గోల్డ్ ఫ్యూచర్స్ 1.48 శాతం తగ్గి ఔన్సుకు రూ.4,341కి పడిపోయాయి. సిల్వర్ ఫ్యూచర్స్ 3.63 శాతం తగ్గి ఔన్సుకు రూ.66.83కి చేరాయి. ఇది కొన్ని నెలల క్రితం ఔన్సుకు $119 గరిష్ట స్థాయికి చేరినప్పటి నుండి దాదాపు సగం. సోమవారం ఒక్క రోజే 10 గ్రాముల బంగారం ధర రూ.2,040 మేర తగ్గింది.

కమోడిటీ మార్కెట్ MCXలో ఉదయం సుమారు 10:20 గంటలకు, ఏప్రిల్ 2, 2026న డెలివరీ అయ్యే బంగారం 1.31 శాతం లేదా రూ.1,800కు పైగా తగ్గి, 10 గ్రాములకు రూ.1,37,471 వద్ద ట్రేడయ్యింది. మే 5, 2026న మెచ్యూర్ అయ్యే వెండి, రూ.7,800కు పైగా తగ్గి, కిలోకు రూ.2,17,366 వద్ద ట్రేడయ్యింది.

తాజాగా బుధవారం అంటే మార్చి 25వ తేదీన దేశీయంగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,42,900 వద్ద కొనసాగుతుండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,30,990 వద్ద ఉంది. ఇక వెండి ధర విషయానికొస్తే కిలో సిల్వర్‌ ధర రూ.2,35,100 వద్ద కొనసాగుతోంది. అయితే హైదరాబాద్‌, కేరళ, చెన్నైలలో కాస్త ఎక్కువగా ఉంది. ఇక్కడ రూ.2,49,900 వద్ద ట్రేడవుతోంది.

ప్రధాన నగరాల్లో ధరలు:

  1. హైదరాబాద్‌:24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,42,900, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,30,990.
  2. విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,42,900, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,30,990.
  3. ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,43,050, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,31,140.
  4. ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,42,900, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,30,990.
  5. బెంగళూరులో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,42,900, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,30,990.
  6. చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,44,550, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,32,490.

నిపుణుల అభిప్రాయం ప్రకారం.. అమెరికా, ఇరాన్‌ల మధ్య ఉద్రిక్తతలు తగ్గుముఖం పడుతున్న తరుణంలో ఈ మార్కెట్ ఒత్తిడి తలెత్తింది. అయితే నిరంతర ద్రవ్యోల్బణ ఆందోళనల కారణంగా యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచే అవకాశం కూడా పెట్టుబడిదారుల సెంటిమెంట్‌పై ప్రభావం చూపుతోంది. అంతేకాకుండా ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కోవడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న కేంద్ర బ్యాంకులు తమ బంగారు నిల్వలను అమ్ముకోవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇది మార్కెట్లో సరఫరాపై ఒత్తిడిని సృష్టిస్తుంది. దీనివల్ల బంగారం, వెండి ధరలు మరింతగా పడిపోయే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

బంగారం, వెండి ధరలు కూప్పకూలుతున్నాయి. మీడియా నివేదికల ప్రకారం, గత 40 ఏళ్లలో బంగారం ధరలు ఇంత భారీగా పడిపోవడం ఇదే మొదటిసారి. ఇరాన్‌తో అమెరికా-ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న యుద్ధమే బంగారం ధరలలో ఈ గణనీయమైన తగ్గుదలకు కారణమని చెబుతున్నారు నిపుణులు. దీని ఫలితంగా 24 రోజుల్లో బంగారం ధర రూ.19,528, వెండి ధర రూ.47,440 మేర పడిపోయింది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us