Pushpa 2: ఐకాన్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్.. పుష్ప 2 ట్రైలర్ వచ్చేస్తుంది..
దాదాపు మూడు సంవత్సరాల తర్వాత అల్లు అర్జున్ మరోసారి పుష్ప రాజ్ గా వెండితెరపైకి రాబోతున్నాడు. 2021 సంవత్సరంలో 'పుష్ప' మొదటి భాగం సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమా భారీ హిట్ అందుకుంది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ పుష్ప 2 కోసం ఎంతో ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. మొన్నటివరకు దేవర కోసం ఆడియన్స్ వేయికళ్లతో ఎదురుచూశారు. ఇప్పుడు దేవర సినిమా రిలీజ్ అయిపోవడంతో పుష్ప 2 కోసం వెయిట్ చేస్తున్నారు. దాదాపు మూడు సంవత్సరాల తర్వాత అల్లు అర్జున్ మరోసారి పుష్ప రాజ్ గా వెండితెరపైకి రాబోతున్నాడు. 2021 సంవత్సరంలో ‘పుష్ప’ మొదటి భాగం సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమా భారీ హిట్ అందుకుంది. ఈ సినిమాలో బన్నీ నటనకు జాతీయ అవార్డు దక్కింది. తెలుగు సినిమా స్థాయిని పుష్ప సినిమా మరో మెట్టు పైకి ఎక్కించింది. ఇక ఇప్పుడు పుష్ప 2తో రానున్నాడు ఐకాన్ స్టార్. అయితే పుష్ప 2 నుంచి ఇప్పటివరకు విడుదలైన పోస్టర్స్, సాంగ్స్ సినిమా పై అంచనాలను భారీగా పెంచేశాయి. ఇక ఈ మూవీ ట్రైలర్ ఎప్పడు విడుదలవుతుందా అని అభిమానులు వెయిట్ చేస్తున్నారు.
ఇది కూడా చదవండి : కుమ్మేస్తున్న కుర్ర భామ.. ఈ తెలుగు అమ్మాడి అందాలు వరుస కడుతున్న ఆఫర్స్
నవంబర్ రెండో వారంలో ‘పుష్ప 2’ ట్రైలర్‌ను విడుదల చేయనున్నారు. నవంబర్ రెండవ వారంలో ట్రైలర్‌ను విడుదల చేయడానికి సుకుమార్, అల్లు అర్జున్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. అలాగే సినిమా విడుదలకు మూడు వారాల ముందు నుంచే ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించబోతున్నట్లు కూడా టాక్ వినిపిస్తుంది. ‘పుష్ప 2’ మొదటి భాగం కంటే 10 రెట్లు ఎక్కువ యాక్షన్ తో ఉండబోతోందని తెలుస్తోంది.
ఇది కూడా చదవండి : Bigg Boss 8 Telugu : బిగ్ బాస్‌లో గంగవ్వ.. హౌస్‌లో సందడే సందడి
‘పుష్ప 2’లోని ప్రతి సన్నివేశం ప్రేక్షకులకు అద్భుతమైన థియేట్రికల్ అనుభూతిని కలిగించే విధంగా సుకుమార్ ప్లాన్ చేస్తున్నారు. మరి ఈ సినిమాతో అల్లు అర్జున్ ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో చూడాలి. సినిమా విడుదల తేదీ డిసెంబర్ 6. అయితే ముందుగా ఈ చిత్రాన్ని ఆగస్ట్‌లోనే విడుదల చేయాలనుకున్నారు. కానీ షూటింగ్ పెండింగ్ కారణంగా వాయిదా పడిందని టాక్. ‘పుష్ప’ మొదటి భాగం అల్లు అర్జున్‌ని పాన్ ఇండియా స్టార్‌ని చేసింది. రూ. 150 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద రూ.350 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ‘పుష్ప 2’ మరింత బంపర్ వసూళ్లు సాధిస్తుందనే నమ్మకంతో ఉన్నారు మేకర్స్. ఇప్పుడు పుష్ప 2 సినిమాను దాదాపు 400 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారని తెలుస్తోంది.
ఇది కూడా చదవండి : Naa Autograph: కుర్రాళ్ళ మనసులు తాకిన భామ.. అందాల లతిక గుర్తుందా.?
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.