Allu Arjun: అల్లు అర్జున్ వద్దన్న సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టిన సల్మాన్ ఖాన్.. ఏదో తెలుసా? అసలు ఊహించలేరు
సినిమాల సెలెక్షన్స్ కు సంబంధించి ఒక్కో హీరో జడ్జిమెంట్ ఒక్కోలా ఉంటుంది. ఒక స్టార్ హీరో వద్దన్న సినిమా ఇంకో హీరో వద్దకు వెళ్లడం, అవి బ్లాక్ బస్టర్ హిట్స్ కావడం ఇండస్ట్రీలో సర్వ సాధారణం. ఈ నేపథ్యంలో టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఓ బ్లాక్ బస్టర్ సినిమాను మిస్ అయ్యాడు. ఇదే మూవీతో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఏకంగా ఇండస్ట్రీ హిట్ కొట్టాడు
సినిమాల సెలెక్షన్స్ కు సంబంధించి ఒక్కో హీరో జడ్జిమెంట్ ఒక్కోలా ఉంటుంది. ఒక స్టార్ హీరో వద్దన్న సినిమా ఇంకో హీరో వద్దకు వెళ్లడం, అవి బ్లాక్ బస్టర్ హిట్స్ కావడం ఇండస్ట్రీలో సర్వ సాధారణం. ఈ నేపథ్యంలో టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఓ బ్లాక్ బస్టర్ సినిమాను మిస్ అయ్యాడు. ఇదే మూవీతో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఏకంగా ఇండస్ట్రీ హిట్ కొట్టాడు. ఆ సినిమా ఏంటో తెలుసా? బజరంగీ భాయిజాన్. అవును ఈ సినిమాలో మొదట హీరోగా అల్లు అర్జున్ ను అనుకున్నారట మేకర్స్. ఈ మూవీ నిర్మాత ఉదయవాణి ముందుగా బన్నీకే ఈ సినిమా కథ వినిపించారట. అయితే అప్పటికే టాలీవుడ్ లో స్టైలిష్ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ చేతి నిండా సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడట. అంతేకాకుండా అప్పట్లో సౌత్ పైనే ఫుల్ ఫోకస్ పెట్టిన బన్నీ బాలీవుడ్ సినిమా చేయడం కరెక్ట్ కాదేమోనని అనుకున్నాడట. అలా అల్లు అర్జున్ నో చెప్పిన తర్వాత బజరంగీ కథ కోలీవుడ్ స్టార్ హీరో రజనీకాంత్ దగ్గరకు వెళ్లిందట. ఆయన కూడా వేరే ప్రాజెక్టులలో బిజీగా ఉన్నానని, ఈ స్టోరీ తనకు సూట్ అవ్వదంటూ చేతలెత్తేశాడట. అలా అల్లు అర్జున్, రజనీకాంత్‌లు రిజెక్ట్ చేసిన కథను ఆఖరిగా సల్మాన్ ఖాన్ దగ్గరకు తీసుకెళ్లారట డైరక్టర్ కబీర్ ఖాన్.
అల్లు అర్జున్, రజనీకాంత్ లు నో చెప్పాకే సల్మాన్ వద్దకు బజరంగీ భాయిజాన్..
‘బజరంగీ భాయిజాన్’ సినిమా కథ సల్మాన్ ను ఎంతగానో ఇంప్రెస్ చేసిందట. అందుకే కథ విన్న వెంటనే సినిమాలో నటించేందుకు ఓకే చెప్పారట. అలా సినిమా సెట్స్ పైకి వెళ్లడం, రిలీజై బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడం చకా చకా జరిగిపోయాయి. 2015లో రిలీజైన బజరంగీ భాయిజాన్ ఓవరాల్ గా రూ. 960 కోట్లకు పైగానే వసూళ్లు సాధించడం విశేషం. ఈ సినిమా సల్మాన్ కెరీర్ లో మరో మైలురాయిలా నిలిచిపోయింది. అంతేకాదు ఈ మూవీ తర్వాత భాయ్‌జాన్ అనే టైటిల్ కూడా సల్మాన్ సొంతమైంది. కాగా ఈ విషయం తెలుసుకున్న అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఒకింత నిరాశ వ్యక్తం చేస్తున్నారు. బజరంగి భాయ్‌జాన్ సినిమాలో బన్నీ హీరోగా నటించిఉంటే అతని కెరీర్ లో ఒక మైల్డ్ స్టోన్ గా మిగిలిపోయేదని కామెంట్స్ చేస్తున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.