Pushpa movie: ఐకాన్ స్టార్ స్టామినా.. అల్లు అర్జున్ కెరియర్లోనే అత్యధిక ధరకి అమ్ముడైన సినిమా..
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులంతా ఇప్పుడు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా పుష్ప. సుకుమార్ డైరెక్షన్ లో బన్నీ చేస్తున్న హ్యాట్రిక్ సినిమా ఇది.
pushpa movie: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులంతా ఇప్పుడు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా పుష్ప. సుకుమార్ డైరెక్షన్ లో బన్నీ చేస్తున్న హ్యాట్రిక్ సినిమా ఇది. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్ లో ఆర్య , ఆర్య2 సినిమాలు వచ్చిన ,విషయం తెలిసిందే. ఇక పుష్ప సినిమాలో బన్నీ డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నాడు. ఈ సినిమాకోసం బన్నీఊర మాస్ లుక్ లోకి మారిపోయాడు ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, టీజర్ సినిమా పైన ఆసక్తిని పెంచాయి. ఎర్ర చందనం స్మగ్లర్ బ్యాక్ డ్రాప్ తో వస్తున్న పుష్ప మూవీలో లారీ డ్రైవర్ గా నటిస్తున్నారు అల్లు అర్జున్. గిరిజన యువతి పాత్రలో కనిపించనుంది స్టార్ హీరోయిన్ రష్మిక. ఆగస్టు 13న రిలీజ్ డేట్ అనుకున్నా.. అది ఇప్పుడున్న పరిస్థితుల్లో కష్టమేనన్న క్లారిటీకొచ్చేశారు మేకర్స్. సేమ్ టైం… సినిమా కంటెంట్ విషయంలో కూడా మేజర్ డెసిషన్ తీసుకున్నారట. పుష్ప1 అండ్ పుష్ప2.. ఇలా సినిమాను రెండు భాగాలుగా విడగొట్టాలన్నది సుక్కూ వేసిన న్యూ ఐడియా అని ఫిల్మ్ నగర్ టాక్ ఇప్పటివరకు 70 పర్సెంట్ షూటింగ్ ముగిసిందని… ఆ రషెస్ తో ఫస్ట్ పార్ట్ ని కంక్లూడ్ చేసి ఆక్టోబర్ 13న రిలీజ్ చేయాలన్నది తాజా ప్లాన్ అట.
తొలి భాగానికి సంబంధించిన షూటింగు కొంతవరకే మిగిలిఉంది. కరోనా ప్రభావం తగ్గగానే చకచకా షూటింగును పూర్తిచేయాలనే ప్లానింగుతోనే ఉన్నారు మేకర్స్. ఈ నేపథ్యంలో ఈ సినిమా బిజినెస్ గురించిన వార్త జోరుగా షికారు చేస్తోంది. ఈ సినిమా ఓవర్సీస్ బిజినెస్ డీల్ పూర్తయిందని అంటున్నారు. ఓవర్సీస్ కి సంబంధించి అల్లు అర్జున్ కెరియర్లోనే అత్యధిక ధరకి అమ్ముడైన సినిమా ఇదేనని చెబుతున్నారు.
మరిన్ని ఇక్కడ చదవండి :