AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pushpa : రికార్డులు తిరగరాస్తున్న పుష్పరాజ్.. 2021లో ఏ సినిమాకు దక్కని మరో రికార్డు ‘పుష్ప’ సొంతం..

సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ మూవీ పుష్ప.. ఈ సినిమా రీసెంట్ గా రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంది.

Pushpa : రికార్డులు తిరగరాస్తున్న పుష్పరాజ్.. 2021లో ఏ సినిమాకు దక్కని మరో రికార్డు 'పుష్ప' సొంతం..
Pushpa
Rajeev Rayala
|

Updated on: Dec 26, 2021 | 10:00 AM

Share

Pushpa : సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ మూవీ పుష్ప.. ఈ సినిమా రీసెంట్ గా రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంది. పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయినా పుష్ప.. విడుదలైన అన్ని ఏరియాల్లో మంచి వసూళ్లను రాబడుతుంది. గంధపుచెక్కల నేపథ్యంలో సాగే ఈ సినిమాలో బన్నీ లారీ డ్రైవర్‌గా కనిపించి ఆకట్టుకున్నాడు. ఇక ఈ సినిమా వసూళ్ల పరంగాను రికార్డులు క్రియేట్ చేస్తుంది. పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయిన ఈ సినిమాలో పుష్ప రాజ్ పాత్రలో ఊర మాస్ లుక్‏లో అదరగొట్టాడు బన్నీ. ఇక అతని ప్రేయసి శ్రీవల్లి పాత్రలో రష్మిక మందన్న మెప్పించింది. డిసెంబర్ 17న విడుదలైన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. రోజు రోజుకీ మరింత జోష్‏తో రికార్డ్స్ కలెక్షన్స్ కురిపిస్తోంది.

తాజాగా పుష్ప సినిమా మరో రికార్డును తన ఖాతాలో వేసుకుంది. బుక్ మై షోలో కేవలం 8 రోజుల్లోనే ఈ సినిమా 35 లక్షలకు పైగా టిక్కెట్లు అమ్ముడయ్యాయని తెలుస్తుంది. 2021లో విడుదలైన ఏ తెలుగు  సినిమాకు దక్కని రికార్డ్ ఇది. మొత్తానికి 2021 లో బన్నీ సినిమా అరుదైన రికార్డును దక్కించుకుంది. బన్ని వన్ మ్యాన్ షోతో పుష్ప సినిమా సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది . ఇక విడుదలకు ముందు ఉన్న అంచనాలను ఆదుకోవడంలో పుష్ప రాజ్ సక్సెస్ అయ్యాడు. ఇక ఈ సినిమా రెండు భాగాలుగా రానుంది. ప్రస్తుతం సుకుమార్ పార్ట్ 2 పై ఫోకస్ పెట్టాడు. త్వరలోనే ఈ రెండో భాగం షూటింగ్ మొదలు కానుంది. ఇక పుష్ప సినిమాలో మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ విలన్ గా నటించాడు, అనసూయ, సునీల్ కీలక పాత్రల్లో నటించారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Bigg Boss 5 Telugu: వెండితెరకు పరిచయం కానున్న మరో బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌.. సినిమా పోస్టర్‌ విడుదల..

Revanth: త్వరలో పెళ్లిపీటలెక్కనున్న సింగర్ రేవంత్‌.. వేడుకగా ఎంగేజ్‌మెంట్‌.. అమ్మాయి ఎవరంటే..

Viral Video: మరోసారి అదరగొట్టిన నైనిక, తనయ.. ఈసారి ‘సామి సామి’ అంటూ నెటిజన్లను కట్టిపడేశారు..

ధర ఎక్కువైనా ఈ పండును కచ్చితంగా తినండి.. ఎందుకో తెలిస్తే..
ధర ఎక్కువైనా ఈ పండును కచ్చితంగా తినండి.. ఎందుకో తెలిస్తే..
సిమ్ కార్డులతో భారీ సైబర్ క్రైమ్.. చెక్‌ పెట్టిన ఏపీ సీఐడి!
సిమ్ కార్డులతో భారీ సైబర్ క్రైమ్.. చెక్‌ పెట్టిన ఏపీ సీఐడి!
విజయ్ హజారే ట్రోఫీకి విరాట్, రోహిత్ శాలరీ ఎంత?
విజయ్ హజారే ట్రోఫీకి విరాట్, రోహిత్ శాలరీ ఎంత?
ఇదో పవర్‌ ఫుల్‌ డిటాక్స్‌ డ్రింక్..!షాకింగ్‌ బెనిఫిట్స్‌ తెలిస్తే
ఇదో పవర్‌ ఫుల్‌ డిటాక్స్‌ డ్రింక్..!షాకింగ్‌ బెనిఫిట్స్‌ తెలిస్తే
థియేటర్లలో సంచలనం.. ఇప్పుడు ఓటీటీలోకి చిన్న సినిమా..
థియేటర్లలో సంచలనం.. ఇప్పుడు ఓటీటీలోకి చిన్న సినిమా..
ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్‌ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..
ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్‌ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వెజ్‌లో నాన్‌వెజ్‌ రుచి కావాలంటే..ఈ కూరగాయతో రెట్టింపు బలం,టేస్ట్
వెజ్‌లో నాన్‌వెజ్‌ రుచి కావాలంటే..ఈ కూరగాయతో రెట్టింపు బలం,టేస్ట్