AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Radhe Shyam: ఇండియన్ సినిమా రికార్డ్స్‌ను బద్దలు కొడుతున్న ‘రాధేశ్యామ్’ ట్రైలర్..

ప్రభాస్ హీరోగా నటిస్తున్న రాధే శ్యామ్ సినిమాపై అంచనాలు ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాలా..? పాన్ ఇండియన్ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం చిత్ర దర్శక నిర్మాతలు కూడా అలాగే కష్టపడుతున్నారు.

Radhe Shyam: ఇండియన్ సినిమా రికార్డ్స్‌ను బద్దలు కొడుతున్న 'రాధేశ్యామ్' ట్రైలర్..
Prabhas
Rajeev Rayala
|

Updated on: Dec 26, 2021 | 9:49 AM

Share

Radhe Shyam: ప్రభాస్ హీరోగా నటిస్తున్న రాధే శ్యామ్ సినిమాపై అంచనాలు ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాలా..? పాన్ ఇండియన్ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం చిత్ర దర్శక నిర్మాతలు కూడా అలాగే కష్టపడుతున్నారు. అలాగే అభిమానులు కూడా రాధే శ్యామ్ అప్ డేట్స్ కోసం ఆసక్తిగా చూస్తున్నారు. ఇటు సౌత్.. అటు నార్త్ ప్రేక్షకులు రెండు చోట్లా సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఈ సినిమా కోసం దేశవ్యాప్తంగా ఉన్న ప్రభాస్ అభిమానులు ఆసక్తిగా వేచి చూస్తున్నారు. ఇప్పటి వరకు విడుదలైన రాధే శ్యామ్ పాటలన్నింటికీ అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా మరో అరుదైన రికార్డు సొంతం చేసుకుంది. ఈ మధ్యే విడుదలైన ట్రైలర్‌కు అనూహ్యమైన స్పందన వస్తుంది. ఒక్క రోజులోనే ఈ చిత్ర ట్రైలర్ 64 మిలియన్ వ్యూస్ అందుకుని ఇండియన్ సినిమా రికార్డులను తిరగరాసింది. ఇక రెండో రోజు కూడా ఆ రికార్డ్ ను కంటిన్యూ చేస్తుంది ఈ ట్రైలర్.  డిసెంబర్ 23న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అభిమానులే అతిథులుగా రాధే శ్యామ్ ట్రైలర్ విడుదల చేసారు. లవ్ స్టోరీతో పాటు యాక్షన్, సస్పెన్స్, డ్రామా, అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్ అన్నీ ట్రైలర్‌లో ఉన్నాయి. 5 భాషలకు సంబంధించిన ట్రైలర్ యూ ట్యూబ్‌లో రికార్డులు తిరగరాస్తుంది.

ఇప్పటికే సినిమా ట్రైలర్ హిందీలో రెండురోజుల్లో 38 మిలియన్ వ్యూస్ ను సొంతం చేసుకుంది. తెలుగులో 31 మిలియన్ వ్యూస్ ను సొంతం చేసుకుంది. తమిళ్ లో 5 మిలియన్ వ్యూస్ ను సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా  కోసం చాలా మంది సంగీత దర్శకులు పని చేస్తున్నారు. జస్టిన్ ప్రభాకరన్, అర్జిత్ సింగ్, మిథున్, అనూ మాలిక్, మనన్ భరద్వాజ్, జబిన్ నౌతీయల్, మనోజ్ ముంటాషిర్, కుమార్, రష్మీ విరాగ్ బృందం అంతా కలిసి సౌత్, నార్త్ వర్షన్స్‌కు రాధే శ్యామ్ సినిమాకు అద్భుతమైన క్లాసిక్ సంగీతం అందిస్తున్నారు. ఇండియన్ సినిమా హిస్టరీలో ఒకేసారి ఒక సినిమాకు రెండు భాషల్లో వేర్వేరు సంగీత దర్శకులు పని చేయడం ఇదే తొలిసారి. మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ.. కమల్ కన్నన్ విజువల్ ఎఫెక్ట్స్ అద్భుతంగా ఉన్నాయి. కోటగిరి వెంకటేశ్వరరావు దీనికి ఎడిటింగ్ వర్క్ చేశారు. యువి క్రియేష‌న్స్ ప్రొడక్షన్స్ వాల్యూస్ చాలా ఉన్నతంగా ఉన్నాయి. ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్ ర‌వీంద‌ర్ చాలా మంచి ప్లానింగ్‌తో డిజైన్ చేశారు. సౌండ్ ఇంజ‌నీర్ ర‌సూల్ పూకుట్టి వ‌ర్క్‌ అద‌న‌పు ఆకర్ష‌ణగా నిలిచింది. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి దర్శక నిర్మాతలు. జనవరి 14, 2022న సినిమా విడుదల కానుంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Bigg Boss 5 Telugu: వెండితెరకు పరిచయం కానున్న మరో బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌.. సినిమా పోస్టర్‌ విడుదల..

Revanth: త్వరలో పెళ్లిపీటలెక్కనున్న సింగర్ రేవంత్‌.. వేడుకగా ఎంగేజ్‌మెంట్‌.. అమ్మాయి ఎవరంటే..

Viral Video: మరోసారి అదరగొట్టిన నైనిక, తనయ.. ఈసారి ‘సామి సామి’ అంటూ నెటిజన్లను కట్టిపడేశారు..

Follow Us
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?