AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: మరోసారి అదరగొట్టిన నైనిక, తనయ.. ఈసారి ‘సామి సామి’ అంటూ నెటిజన్లను కట్టిపడేశారు..

Viral Video: సోషల్‌ మీడియా విస్తృతి పెరిగినప్పటి నుంచి ప్రతిభను ప్రదర్శించుకోవడానికి ఒక మంచి ప్లాట్‌ఫామ్‌ దొరికింది. ఎంతో మంది ఔత్సాహిక ప్రతిభావంతులు తమలోని ట్యాలెంట్‌ను యూట్యూబ్‌..

Viral Video: మరోసారి అదరగొట్టిన నైనిక, తనయ.. ఈసారి 'సామి సామి' అంటూ నెటిజన్లను కట్టిపడేశారు..
Narender Vaitla
|

Updated on: Dec 25, 2021 | 9:21 PM

Share

Viral Video: సోషల్‌ మీడియా విస్తృతి పెరిగినప్పటి నుంచి ప్రతిభను ప్రదర్శించుకోవడానికి ఒక మంచి ప్లాట్‌ఫామ్‌ దొరికింది. ఎంతో మంది ఔత్సాహిక ప్రతిభావంతులు తమలోని ట్యాలెంట్‌ను యూట్యూబ్‌, ఫేస్‌బుక్‌ ద్వారా బయటపెడుతున్నారు. ఈ క్రమంలోనే సినిమా పాటలకు స్టెప్పులు వేస్తూ నెటిజన్లను మెస్మరైజ్‌ చేస్తున్నారు. ఇలా సోషల్‌ మీడియాలో సందడి చేస్తున్న వారిలో నైని, తనయ అనే ఇద్దరు చిన్నారుల పేర్లు ఇటీవల బాగా వినిపిస్తున్నాయి. ఈ ఇద్దరు చిన్నారులు ఇప్పటి వరకు చాలా పాటలకు కాలు కదుపుతూ నెటిజన్లను తెగ ఆకట్టుకుంటున్నారు.

ఇప్పటికే బుల్లెట్‌ బండి, హి ఈజ్‌ క్యూట్‌ వంటి పాటలతో మెస్మరైజ్‌ చేసిన ఈ క్యూట్ గర్ల్స్‌ తాజాగా పుష్ప సినిమాలోని పాటకు కాలు కదిపారు. పుష్ప సినిమాలో రష్మిక డ్యాన్స్‌ చేసిన ‘సామి సామి’ పాటకు స్టెప్పులేశారు. లంగా, వోణీలో అచ్చంగా రష్మికలానే మాస్‌ సాంగ్‌కు స్టెప్పులు ఇరగదీశారు. సామీ సామీ పాట తమిళ్‌ వెర్షన్‌కు నైనిక, తనన్య చేసిన డ్యాన్స్‌ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఈ చిన్నారుల డ్యాన్స్‌ చూసిన నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ వీడియోను యూట్యూబ్‌లో పోస్ట్‌ చేసిన కొద్ది సమయంలోనే రెండున్నర లక్షలకుపైగా వ్యూస్‌తో దూసుకుపోతోంది. మరి ఈ డ్యాన్స్‌పై మీరు కూడా ఓ లుక్కేయండి..

Also Read: Jabardasth Varsha: యెల్లో డ్రెస్ లో కేక పుట్టిస్తున్న జబర్దస్త్ వర్ష

IND vs SA: విరాట్ కోహ్లీ గొప్ప ఆటగాడు.. అతను జట్టుకు సారథ్యం వహించిన తీరు అద్భుతం..

Telangana: కళ్లల్లో కారం కొట్టి చోరీ చేసేందుకు యత్నించాడు.. కానీ ప్లాన్ ఉల్టా అయ్యింది..