Telangana: కళ్లల్లో కారం కొట్టి చోరీ చేసేందుకు యత్నించాడు.. కానీ ప్లాన్ ఉల్టా అయ్యింది..

కిరాణా షాప్ నిర్వహించే మహిళ కళ్ళల్లో కారం చల్లి మెడలో మంగళసూత్రాన్ని అపహరించుకుని వెళ్లే ప్రయత్నం చేశాడు ఓ దొంగ. కానీ అతడి ప్లాన్ బెడిసికొట్టింది.

Telangana: కళ్లల్లో కారం కొట్టి చోరీ చేసేందుకు యత్నించాడు.. కానీ ప్లాన్ ఉల్టా అయ్యింది..
Thief Caught
Follow us
Ram Naramaneni

|

Updated on: Dec 25, 2021 | 5:47 PM

కిరాణా షాప్ నిర్వహించే మహిళ కళ్ళల్లో కారం చల్లి మెడలో మంగళసూత్రాన్ని అపహరించుకుని వెళ్లే ప్రయత్నం చేశాడు ఓ దొంగ. సరిగ్గా అదే సమయానికి మరో మహిళ రావడంతో అడ్డంగా బుక్కయ్యాడు. అదే కారం అతని కళ్లల్లో కొట్టింది అక్కడికి వచ్చిన మహిళ. ఇంకేముంది చుట్టు ఉన్న జనం తలో చేయి వేశారు.ఈ ఘటన కామారెడ్డి పట్టణంలో జరిగింది.

కిరాణా షాప్ దగ్గరకు వచ్చిన ఇతను హెల్మెట్ పెట్టుకుని బైక్ పై వచ్చాడు. జేబులో చేతులు పెట్టి డబ్బులు ఇస్తున్నట్టు నటించి షాప్ లో వస్తువులు కావాలని అడిగాడు. దాంతో ఆమె వస్తువులు ఇస్తుండగానే హెల్మెట్ ధరించి ఉన్న వ్యక్తి తన జోబులో నుంచి కారం పొడి తీసి ఆ మహిళ కళ్ళల్లో చల్లాడు. వెంటనే ఆమె మెడలోని మంగళసూత్రాన్ని లాక్కొని బైక్ పై పారిపోయే ప్రయత్నం చేశాడు. ఆదే సమయంలో సరుకుల కోసం కిరాణా షాప్ షాప్ కు వచ్చిన మరో మహిళ ఆ దొంగను అడ్డుకొని అతని జేబులోంచి కారం తీసి అతని కళ్లలోనే కొట్టి కేకలు వేయడంతో స్థానికులు అక్కడికి చేరుకుని దొంగకు దేహశుద్ధి చేసి అనంతరం మంగళసూత్రాన్ని బాధిత మహిళకు అప్పగించారు.

Also Read: వ్యాపారుల దోపిడి తాళలేక జామ రైతు ఈ పనిచేశాడు.. ఇప్పుడు డబుల్ ప్రాఫిట్

ఇదెక్కడి మాస్‌రా మామ..! పుష్ప సాంగ్‌పై మీమ్ చూసి పిచ్చిపిచ్చిగా నవ్విన సమంత