Bigg Boss 5 Telugu: వెండితెరకు పరిచయం కానున్న మరో బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌.. సినిమా పోస్టర్‌ విడుదల..

బిగ్‌బాస్‌.. బుల్లితెరపై ప్రసారమయ్యే ఈ రియాలిటీ షో ప్రేక్షకులకు ఎంటర్‌ టైన్‌ అందించడంతో పాటు షోలో పాల్గొన్న పోటీదారులకు ఎనలేని క్రేజ్‌ను తీసుకొస్తుంది. హౌస్‌లో ఉన్నన్ని రోజులకు భారీ రెమ్యునరేషన్‌ అందుకునే కంటెస్టెంట్లకు సోషల్‌ మీడియాలోనూ విపరీతంగా క్రేజ్‌ పెరుగుతుంది

Bigg Boss 5 Telugu: వెండితెరకు పరిచయం కానున్న మరో బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌.. సినిమా పోస్టర్‌ విడుదల..
Biggboss 5 Telugu
Follow us
Basha Shek

|

Updated on: Dec 26, 2021 | 8:04 AM

బిగ్‌బాస్‌.. బుల్లితెరపై ప్రసారమయ్యే ఈ రియాలిటీ షో ప్రేక్షకులకు ఎంటర్‌ టైన్‌ అందించడంతో పాటు షోలో పాల్గొన్న పోటీదారులకు ఎనలేని క్రేజ్‌ను తీసుకొస్తుంది. హౌస్‌లో ఉన్నన్ని రోజులకు భారీ రెమ్యునరేషన్‌ అందుకునే కంటెస్టెంట్లకు సోషల్‌ మీడియాలోనూ విపరీతంగా క్రేజ్‌ పెరుగుతుంది. ఈ క్రమంలో ఇప్పటికే చాలా మంది సినిమా అవకాశాలను సైతం సొంతం చేసుకున్నారు. అంతకు ముందు సిల్వర్‌ స్ర్కీన్‌పై కనిపించని వారు కూడా సినిమా ఛాన్స్‌లను సొంతం చేసుకున్నారు. ఇదిలా ఉంటే తాజాగా బిగ్‌బాస్‌ 5వ సీజన్‌లో పాల్గొన్న కంటెస్టెంట్‌ కూడా సినిమా ఆఫర్‌ను సొంతం చేసుకున్నారు.

బిగ్‌బాస్‌ తెలుగు ఐదో సీజన్‌లో సందడి చేసిన ఏకైక మోడల్‌ జశ్వంత్‌ పడాల అలియాస్‌ జెస్సీ. వర్టిగో వ్యాధితో సతమతమవుతోన్న అతడు మధ్యలోనే బిగ్‌బాస్‌ నుంచి ఎలిమినేట్‌ అయ్యాడు. హౌస్‌ నుంచి బయటకు వచ్చిన తర్వాత కొన్ని టీవీ ప్రోగ్రాముల్లో పాల్గొంటున్న జెస్సీ తాజాగా ఓ సినిమా ఆఫర్‌ను కూడా దక్కించుకున్నాడు. తాజాగా తన మొదటి సినిమా టైటిల్‌ పోస్టర్‌ను కూడా విడుదల చేశాడు. ‘ఎర్రర్‌ 500’ అనే పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రం పోస్టర్‌లో జెస్సీ ముఖం మీద నెత్తుటి గాయలతో చేతిలో గన్‌ పట్టుకుని యాక్షన్‌ హీరోగా దర్శనమిస్తున్నాడు. సందీప్‌ మైత్రి ఈసినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రి మోషన్‌ పిక్చర్స్‌ బ్యానర్‌పై బాల్‌ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా ‘ ఇదే నా మొదటి సినిమా పోస్టర్ ‘ఎర్రర్ 500′. ఇందులో ఎన్నో సర్‌ప్రైజ్‌ ఎలిమెంట్స్ . మీ అందరి ఆశీస్సులు, ప్రేమాభిమానాలతో ఈ సినిమాను ప్రారంభించాను. భవిష్యత్తులో మీకు మరింత వినోదం పంచుతాను’ అని ఇన్‌స్టాలో మురిసిపోయాడు జెస్సీ.

Also Read:

Revanth: త్వరలో పెళ్లిపీటలెక్కనున్న సింగర్ రేవంత్‌.. వేడుకగా ఎంగేజ్‌మెంట్‌.. అమ్మాయి ఎవరంటే..

Revanth: త్వరలో పెళ్లిపీటలెక్కనున్న సింగర్ రేవంత్‌.. వేడుకగా ఎంగేజ్‌మెంట్‌.. అమ్మాయి ఎవరంటే..

Trending Video: అయ్యో..! ఆపదలో పప్పి.. చూసిన మరో కుక్కపిల్ల ఏం చేసిందో తెలుసా..

మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!