Pushpa 2: సినిమా లవర్స్‌కు గుడ్ న్యూస్.. తగ్గిన పుష్ప 2 టికెట్ ధరలు.. సోమవారం నుంచి రేట్లు ఇవే
అల్లు అర్జున్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘పుష్ప2: ది రూల్’. సుకుమార్ తెరకెక్కించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ డిసెంబర్ 05 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలైన మూడు రోజుల్లోనే ఏకంగా రూ. 621 కోట్లు రాబట్టింది.
పుష్ప 2 సినిమా బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకెళుతోంది. డిసెంబర్ 05న విడుదలైన ఈ యాక్షన్ థ్రిల్లర్ మూడురోజుల్లో రూ.621 కోట్లు వసూలు చేసినట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. కాగా సోమవారం (డిసెంబర్ 09) నుంచి పుష్ప 2 టికెట్ ధరలు తగ్గనున్నాయి. దీంతో ఈ సినిమాకు మరింత మంది ఆడియెన్స్ వస్తారని ట్రేడ్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. టికెట్ ధర రూ.800 పెంచింది కేవలం ప్రీమియర్ షోకు మాత్రమేనని, త్వరలోనే టికెట్ ధరలు అందరికీ అందుబాటులో ఉండేలా చూస్తామని నిర్మాతలు తెలిపారు. అందుకు తగ్గట్టుగానే సోమవారం నుంచి పుష్ప 2 టికెట్ ధరలు స్పల్పంగా తగ్గాయి. బుక్ మై షోలో అందుబాటులో ఉంచిన టికెట్ ధరలను చూస్తే ఇది అర్థమవుతోంది. పుష్ప 2 టికెట్ ధరల పెంపునకు రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అంగీకరించాయి. దీంతో డిసెంబరు 4న స్పెషల్ ప్రీమియర్‌కు అదనంగా రూ.800 ధర నిర్ణయించడంతో టికెట్ ధర ఏకంగా వెయ్యి రూపాయలు దాటేసింది. అలాగే ఆదివారం వరకూ సింగిల్ స్క్రీన్‌లలో రూ.150, మల్టీప్లెక్స్‌లో రూ.200 పెంచారు. దీంతో మల్టీప్లెక్స్‌లో ‘పుష్ప 2’ చూడాలంటే, రూ.500పైనే చెల్లించాల్సి వచ్చేది. ఇక సింగిల్ స్క్రీన్‌లో రూ.300పైగానే ఉంది. అయితే ఈ వారం టికెట్ ధరలు తగ్గనున్నాయి. డిసెంబర్ 09 నుంచి 16 వరకు సింగిల్ స్క్రీన్‌లో రూ.105, మల్టీప్లెక్స్‌లో రూ.150 పెంపునకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. నైజాంలో పెంచిన ధరతో పోలిస్తే టికెట్ ధరలు ఇంకాస్త తగ్గినట్లు బుక్‌మై షోలో చూపిస్తోంది.
ఇక సింగిల్ స్క్రీన్‌లో టికెట్ ధర రూ.200 (జీఎస్టీ ఎక్స్ ట్రా) ఉండగా, మల్టీప్లెక్స్‌లో రూ.395గా ఉంది. ఇక విజయవాడలోనూ మల్టీప్లెక్స్‌లో టికెట్ ధర రూ.300 ఉండగా, సింగిల్ స్క్రీన్‌లో రూ.220 మాత్రమే ఉంది. వైజాగ్‌లో సింగిల్ స్క్రీన్‌లో రూ.295 ఉండగా, మల్టీప్లెక్స్‌లో రూ.300-377 వరకూ ఉన్నట్లు బుక్‌మై షోలో చూపిస్తోంది. అయితే ఏరియా/థియేటర్‌ను బట్టి పుష్ప 2 టికెట్ ధరలు స్పల్ప మార్పులు ఉండవచ్చు.
Attention🚨 – Nizam ticket price reduction from Monday onwards #Pushpa2 Multiplex – 395/- Single screen – 200/- Book your tickets Now 🙂 pic.twitter.com/pgpT2NLoiR
— The Vibe Hub Telugu (@thevibe_reviews) December 8, 2024
కాగా బాలీవుడ్ లో ఇప్పటికే ‘జవాన్’, ‘పఠాన్’ చిత్రాల రికార్డులను బద్దలు కొట్టింది పుష్ప 2. ఈ సినిమా రోజువారీ వసూళ్లు వంద కోట్ల రూపాయలకు పైమాటేనని తెలుస్తోంది. గురువారం (డిసెంబర్ 5) ఈ చిత్రం రూ.175 కోట్లు వసూలు చేసింది. శుక్రవారం (డిసెంబర్ 6) రూ.93.8 కోట్లు, శనివారం (డిసెంబర్ 7) రూ.119 కోట్లు వసూలు చేసింది. ఈ చిత్రం ఆదివారం నాడు రూ.141 కోట్లు వసూలు చేసిందని తెలుస్తోంది.
.మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.