Allu Arjun: మరికొద్దిసేపట్లో అల్లు అర్జున్‌ బెయిల్‌ పిటిషన్‌ కోర్టు తీర్పు

సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్‌కు డిసెంబర్‌ 13న 14 రోజుల రిమాండ్‌ విధించింది నాంపల్లి కోర్టు. దీనిపై అల్లు అర్జున్ తరపున అడ్వొకేట్లు వెంటనే హైకోర్టును ఆశ్రయించారు, క్వాష్‌ పిటిషన్ దాఖలు చేశారు. వాదనల అనంతరం హైకోర్టు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది. అదే రోజు బెయిల్ వచ్చినా మర్నాడు ఉదయం చంచల్‌గూడ నుంచి అల్లు అర్జున్ విడుదలయ్యారు.

Allu Arjun: మరికొద్దిసేపట్లో అల్లు అర్జున్‌ బెయిల్‌ పిటిషన్‌ కోర్టు తీర్పు
Allu Arjun
Follow us
Rajeev Rayala

|

Updated on: Jan 03, 2025 | 11:55 AM

అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు రిలీఫ్ ఇస్తుందా.? లేదా.? కాసేపట్లో తేలనుంది. హైకోర్టు బెయిల్‌పై ఉన్న అల్లు అర్జున్ నాంపల్లి కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. మరి నాంపల్లి కోర్టు ఎలాంటి డైరెక్షన్ ఇవ్వబోతుంది.? ఇదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అల్లు అర్జున్‌ బెయిల్‌ పిటిషన్‌పై ఇవాళ నాంపల్లి కోర్టు తీర్పు ఇవ్వనుంది. గత నెల 26న రెగ్యులర్ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు అల్లు అర్జున్. రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌పై ఇప్పటికే  వాదనలు ముగిసాయి. మరోవైపు ఇప్పటికే అల్లు అర్జున్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు.

సంధ్య థియేటర్‌ తొక్కిసలాట ఘటన కేసులో అల్లు అర్జున్‌ బెయిల్‌ పిటిషన్‌పై నాంపల్లి కోర్టు నేడు తీర్పు వెల్లడించనుంది. అల్లు అర్జున్‌ బెయిల్‌ పిటిషన్‌పై ఇప్పటికే వాదనలు ముగియడంతో నేడు తీర్పు ఇవ్వనుంది. దాంతో.. అల్లు అర్జున్‌ బెయిల్‌ పిటిషన్‌పై నాంపల్లి కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందన్నది ఉత్కంఠ రేపుతోంది.

ఇక.. సంధ్య థియేటర్‌ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందడంతో.. ఆమె మృతికి అల్లు అర్జునే కారణమంటూ చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించి పోలీసులు, అల్లు అర్జున్‌ తరపు లాయర్ల వాదనలు పూర్తవడంతో నాంపల్లి కోర్టు నేడు తీర్పు వెల్లడించబోతోంది. ఈ కేసులో ఇప్పటికే అల్లు అర్జున్‌ మధ్యంతర బెయిల్‌పై ఉన్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి