Allu Arjun: ఉపాసన శ్రీమంతం వేడుకలో అల్లు అర్జున్ సందడి.. చరణ్‏తో బన్నీ.. వీడియో వైరల్..

దాదాపు 11 ఏళ్ల తర్వాత తమ జీవితాల్లో అడుగుపెట్టబోతున్న చిన్నారి కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు చరణ్, ఉపాసన. గత కొద్ది రోజులుగా ఉపాసనతో ఉండేందుకు ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు చరణ్. ఇటీవలే వీరిద్దరు కలిసి విదేశాలకు వెళ్లొచ్చిన సంగతి తెలిసిందే.

Allu Arjun: ఉపాసన శ్రీమంతం వేడుకలో అల్లు అర్జున్ సందడి.. చరణ్‏తో బన్నీ.. వీడియో వైరల్..
Allu Arjun
Follow us
Rajitha Chanti

|

Updated on: Apr 24, 2023 | 3:22 PM

మెగా ఫ్యామిలీలోకి త్వరలోనే వారసులు రాబోతున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ త్వరలోనే తండ్రిగా ప్రమోషన్ పొందనున్న సంగతి తెలిసిందే. ఆయన సతీమణి ఉపాసన కొణిదెల జూలైలో పండంటి బిడ్డకు జన్మనివ్వబోతున్నట్లు ఇదివరకే మెగా ఫ్యామిలీ వెల్లడించింది. దాదాపు 11 ఏళ్ల తర్వాత తమ జీవితాల్లో అడుగుపెట్టబోతున్న చిన్నారి కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు చరణ్, ఉపాసన. గత కొద్ది రోజులుగా ఉపాసనతో ఉండేందుకు ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు చరణ్. ఇటీవలే వీరిద్దరు కలిసి విదేశాలకు వెళ్లొచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కొద్ది రోజుల క్రితం దుబాయ్ లో ఉపాసన బేబీ షవర్ జరిగింది. ఆమె కుటుంబసభ్యులు.. అతి కొద్ది మంది సన్నిహితుల సమక్షంలో ఈ వేడుకను నిర్వహించారు. తాజాగా మరోసారి ఉపాసన శ్రీమంతం హైదరాబాద్ లో జరిగినట్లుగా తెలుస్తోంది.

మెగా ఫ్యామిలీ మెంబర్స్‏తోపాటు.. పలువురు తారలు సైతం ఉపాసన శ్రీమంతం వేడుకలో సందడి చేశారు. ఈ వేడుకకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హాజరయ్యాడు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఇన్ స్టాలో తెలియిజేస్తూ.. ఉపాసనతో కలిసి దిగిన పిక్ షేర్ చేశారు. చాలా సంతోషంగా ఉంది డియర్ ఉప్సీ అంటూ రాసుకొచ్చారు. మరోవైపు చెర్రీతో కలిసి బన్నీ ఫన్నీగా మాట్లాడుతున్న వీడియో సైతం నెట్టింట తెగ వైరలవుతుంది. అందులో చెర్రీ, బన్నీ ఇద్దరూ బ్లాక్ అండ్ బ్లాక్ డ్రెస్ లో కనిపిస్తున్నారు. ఒక్క ఫోటోతో చాలా కాలంగా మెగా ఫ్యామిలీ.. అల్లు ఫ్యామిలీ గురించి వస్తున్న రూమర్లకు చెక్ పెట్టేశారు బన్నీ.

ఇవి కూడా చదవండి

ప్రస్తుతం చరణ్, బన్నీ తమ సినిమా షూటింగ్స్ లలో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం బన్నీ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప 2 చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో రష్మిక మందన్నా కథానాయికగా నటించగా..ఫహద్ ఫాజిల్ కీలకపాత్రలో నటిస్తున్నారు. త్వరలోనే ఈ మూవీ అడియన్స్ ముందుకు రానుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.