Nayanthara: వంటింటి ఫొటోలను షేర్ చేసిన విఘ్నేష్.. నయన్ దంపతుల కోసం ‘ప్రేమతో చేసిన బిర్యానీ’.
ప్రపంచ వ్యాప్తంగా ముస్లింలు రంజాన్ వేడుకలను అంగరంగవైభవంగా జరుపుకున్నారు. సామాన్యులు, సెలబ్రిటీలు అనే తేడా లేకుండా పండుగలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇక రంజాన్ ముస్లింలు పండగే అయినప్పటికీ మతంతో సంబంధం లేకుండా ఇతరులు కూడా జరుపుకుంటుంటారు. ముఖ్యంగా రంజాన్ వేళ చేసే...
ప్రపంచ వ్యాప్తంగా ముస్లింలు రంజాన్ వేడుకలను అంగరంగవైభవంగా జరుపుకున్నారు. సామాన్యులు, సెలబ్రిటీలు అనే తేడా లేకుండా పండుగలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇక రంజాన్ ముస్లింలు పండగే అయినప్పటికీ మతంతో సంబంధం లేకుండా ఇతరులు కూడా జరుపుకుంటుంటారు. ముఖ్యంగా రంజాన్ వేళ చేసే ఫుడ్ ప్రతీ ఒక్కరికీ నచ్చుతుంది. బిర్యానీ మొదలు కీర్ వరకు ఇలా ప్రతీ వంటకం ప్రత్యేకమే. ముస్లింలు ఇతర మతాల్లోని తమ స్నేహితులకు, సన్నిహితులకు ఈద్ సందర్భంగా ఫుడ్ ఇవ్వడం సర్వసాధారమే.
అయితే రంజాన్ పండగ వేళ తమకు కూడా తమ ముస్లిం స్నేహితులు ఫుడ్ పంపించారని తెలిపారు దర్శకుడు, నయనతార భర్త విఘ్నేశ్. రంజాన్ చేసిన ముస్లింలు స్నేహితులు ఆప్యాయంగా పంపించిన ఫుడ్‌కు సంబంధించిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా షేర్ చేశారు. రకరకాల స్వీట్లు, వంటకాలతో కూడిన పదికి పైగా టిఫిన్ బాక్సుల ఫొటోలను విఘ్నేశ్ ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. ఈ ఫొటోలతో పాటు ‘ప్రేమతో చేసిన బిర్యానీ.. రంజాన్‌ను ఇలా సెలబ్రేట్ చేసినందుకు నా మిత్రులందరికీ ధన్యవాదాలు. ఈద్ ముబారక్’ అంటూ రాసుకొచ్చారు విఘ్నేశ్.
View this post on Instagram
విఘ్నేశ్ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అదే సమయంలో నయనతార, విఘ్నేష్‌లు నివసిస్తున్న ఇంటికి సంబంధించి వంటింటి ఫొటోలపై నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఇక నయనత తార కెరీర్ విషయానికొస్తే ఈ బ్యూటీ ప్రస్తుతం షారుఖ్ ఖాన్ హీరోగా తెరకెక్కుతోన్న జవాన్‌తో పాటు తమిళంలో పలు చిత్రాల్లో నటిస్తోంది. అలాగే నయన్ తార, విఘ్నేశ్‌లు ఇటీవల సరోగసి విధానం ద్వారా కవలలకు జన్మనిచ్చిన విషయం విధితమే.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..