Shruti Haasan: మరో పచ్చబొట్టు వేయించుకున్న శ్రుతిహాసన్.. ఆ పేరు ఎవరిదంటే..
తారలు తమ ఒంటిపై పచ్చబొట్టు వేయింకోవడానికి తెగ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. తమకు నచ్చినవారి పేరును లేదా.. ప్రత్యేకమైన తేదీలను తమ శరీరంపై టాటూలుగా మార్చుకుంటారు. అందులో శ్రుతిహాసన్ ముందుంటారు. ఈ క్రమంలోనే తన ఒంటిపై మరో పచ్చబొట్టు వేయించుకున్నారు. అయితే ఇప్పటివరకు ఆమె శరీరంపై ఉన్న అన్ని టాటూలకు ఇది భిన్నంగా ఉందనే చెప్పాలి.
బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ ఖాతాలో వేసుకుని ఫుల్ జోష్ మీదుంది శ్రుతి హాసన్. ఈ ఏడాది నటించిన వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి సినిమాలు బ్లాక్ బస్టర్స్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్న సలార్ చిత్రంలో నటిస్తుంది. ఇప్పటివరకు ఆమె నటించిన చిత్రాల్లో ఇదే భారీ బడ్జెట్ పాన్ చిత్రం కావడం విశేషం. అయితే వెండితెరపైనే కాకుండా.. నిజజీవితంలో శ్రుతి హాసన్ కాస్త విభిన్నం. గ్లామర్ ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడానికి నిత్యం శ్రమిస్తుంటారు. ముఖ్యంగా తారలు తమ ఒంటిపై పచ్చబొట్టు వేయింకోవడానికి తెగ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. తమకు నచ్చినవారి పేరును లేదా.. ప్రత్యేకమైన తేదీలను తమ శరీరంపై టాటూలుగా మార్చుకుంటారు. అందులో శ్రుతిహాసన్ ముందుంటారు. ఈ క్రమంలోనే తన ఒంటిపై మరో పచ్చబొట్టు వేయించుకున్నారు. అయితే ఇప్పటివరకు ఆమె శరీరంపై ఉన్న అన్ని టాటూలకు ఇది భిన్నంగా ఉందనే చెప్పాలి.
ఈసారి తనలోని భక్తిభావన్ని ప్రదర్శించారు శ్రుతి హాసన్. తన ఇష్టదైవం మురుగన్ ఆయుధంలోనే..తమిళంలో తన పేరుండేలా పచ్చబొట్టు డిజైన్ చేయించుకున్నారు. ఈ విషయాన్ని ఇన్ స్టా ద్వారా తెలియజేశారు శ్రుతి. ‘నేనెప్పుడూ ఆధ్యాత్మికతవైపు మొగ్గు చూపుతుంటాను. నా హృదయంలో మురుగన్ కు ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ పచ్చబొట్టుతో నాలోని భక్తిని ప్రదర్శించాలనుకుంటున్నాను’ అని చెప్పుకొచ్చారు. తాజాగా ఆమె వేయించుకున్న పచ్చబొట్టు ఫోటో వైరలవుతుంది.
ఇది కాకుండా శ్రుతికి శరీరంపై మరిన్ని పచ్చబొట్లు ఉన్నాయి. మణికట్టుపై గులాబీ.. చెవి వెనక సంగీతాన్ని గుర్తు చేసేలా టాటూస్ వేయించుకున్నారు. ఇక ఇప్పుడు ఈ రెండింటికి సంబంధం లేకుండా భిన్నంగా పచ్చబొట్టు వేయంచుకున్నారు శ్రుతి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.