Pushpa: లొకేషన్స్ వేట మొదలు పెట్టిన పుష్ప.. త్వరలోనే సెట్స్ పైకీ..
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun).. డైరెక్టర్ సుకుమార్ కాంబోలో వచ్చిన హ్యాట్రిక్ చిత్రం పుష్ప (Pushpa). గతేడాది డిసెంబర్ లో విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun).. డైరెక్టర్ సుకుమార్ కాంబోలో వచ్చిన హ్యాట్రిక్ చిత్రం పుష్ప (Pushpa). గతేడాది డిసెంబర్ లో విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. పాన్ ఇండియా లెవల్లో ఈ మూవీ కలెక్షన్ల సునామీ సృష్టించింది. సౌత్ టూ నార్త్ బాక్సాఫీస్ రికార్డ్స్ తిరగరాసింది. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీలో అల్లు అర్జున్ పక్కా ఊర మాస్ లుక్కులో కనిపించి అదుర్స్ అనిపించాడు. ఇక ఇందులో పుష్ప రాజ్ ప్రేయసి శ్రీవల్లి పాత్రలో రష్మిక మందన్న నటించి మెప్పించింది. ఈ సినిమాతో నార్త్ లో బన్నీ ఒక్కసారిగా పెరిగిపోయింది. అయితే ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తెరకెక్కిస్తు్న్న సంగతి తెలిసిందే. ఫిబ్రవరిలో పుష్ప సెకండ్ పార్ట్ షూటింగ్ ప్రారంభం కానుందని ముందునుంచి టాక్ వినిపించింది. తాజాగా ఈ మూవీ నుంచి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది.
ప్రస్తుతం పుష్ప సెకండ్ పార్ట్ షూటింగ్ కోసం లొకేషన్స్ వేటలో పడ్డారట చిత్రయూనిట్. ముందుగా పుష్ప మొదటి భాగం తీసిన లొకేషన్స్లోనే పుష్ప పార్ట్ 2 తీయాలనుకున్నారట..కానీ.. ఇప్పుడు పుష్ప కోసం కొత్త లొకేషన్స్ వెతికే పనిలో పడ్డారట. ఇక ఇందులో మరో స్టార్ హీరో కీలక పాత్ర చేయబోతున్నారని సమాచారం. బాలీవుడ్ ప్రేక్షకులకు మరింత చేరువయ్యేందుకు ఆ కీలక పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరో నటించనున్నట్లుగా టాక్. పుష్పలో స్మగ్లర్ గా ఎదుగుతూ వచ్చిన హీరో.. సెకండ్ పార్టులో స్మగ్లింగ్ సామ్రాజ్యానికి డాన్ గా మారి అందరిని శాసించే స్థాయిలో కనిపిస్తాడట. పుష్పరాజ్ భార్యగా రష్మిక కనిపించనుంది. ఇక సెకండ్ పార్టులో అనసూయ, ఫహద్ ఫాజిల్ ఇద్దరూ కలిసి పుష్ప రాజ్ పై పగతో అతడిని అణచివేయడానికి సన్నాహాలు చేస్తారని.. వారిని ఎదురించి పుష్ప ఎలా డాన్ గా స్థిరపడిపోతాడనేది సినిమా అంటూ ఫిల్మ్ సర్కిల్లో వార్తలు వినిపిస్తున్నాయి.
Also Read: Bheemla Nayak Review: సమ్మర్ సినిమాలకు శుభారంభం.. భీమ్లా నాయక్.. పర్‌ఫెక్ట్ మూవీ రివ్యూ..
Bheemla Nayak: భీమ్లా నాయక్ సినిమాపై స్పందించిన చంద్రబాబు, లోకేష్.. ఏమన్నారంటే..
Viral Photo: ఇతడి డైలాగ్ గర్జనలా ఉంటుంది.. ఫైట్ యుద్ధంలా ఉంటుంది.. ఎవరో గుర్తించారా




