Allu Arjun : పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ చేయబోయేది ఆ స్టార్ డైరెక్టర్ తోనేనా..?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రీసెంట్ గా పుష్ప సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ అందుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం పుష్ప సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న బన్నీ త్వరలోనే పుష్ప పార్ట్ 2 షూటింగ్ లో జాయిన్ అవ్వనున్నాడు.
Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రీసెంట్ గా పుష్ప సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ అందుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం పుష్ప సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న బన్నీ త్వరలోనే పుష్ప పార్ట్ 2 షూటింగ్ లో జాయిన్ అవ్వనున్నాడు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో బన్నీ మాస్ లుక్ లో కనిపించి ఆకట్టుకున్నాడు. సుకుమార్ మేకింగ్ అల్లు అర్జున్ యాక్టింగ్ సినిమాను బ్లాక్ బస్టర్ దిశగా నడిపించాయి. ఇక ఈ సినిమాకు దేవీశ్రీ అందించిన మ్యుజిక్ సినిమాకు చాలా ప్లస్ అయ్యింది. ఇప్పుడు ఎక్కడ విన్నా పుష్ప మూవీ సాంగ్సే.. ఎక్కడ చూసిన పుష్ప మూవీ డైలాగ్సే. ఇదిలా ఉంటే పుష్ప సినిమాతో బన్నీ ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. ఇప్పుడు బన్నీతో సినిమాలు చేయడానికి దర్శకులు క్యూకడుతున్నారు. ఇక పుష్ప 2 తర్వాత బన్నీ ఎవరితో సినిమా చేయబోతున్నాడన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
అయితే ఈ అవకాశం బోయపాటి శ్రీను దక్కించుకున్నారని టాక్ నడుస్తుంది. ఇటీవలే నందమూరి బాలకృష్ణతో అఖండ సినిమా చేశారు బోయపాటి. ఈ సినిమా సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. ఇక బన్నీ బోయపాటి కాంబినేషన్ లో గతంలో సరైనోడు సినిమా వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా కూడా సూపర్ హిట్ అయ్యింది. ఇప్పుడు ఈ ఇద్దరి కాంబినేషన్ లో మరో సినిమా రానుంది. పుష్ప 2 షూటింగ్ త్వరలోనే మొదలు కానుంది. ఈ సినిమా షూటింగ్ ఎంతలేదన్నా దాదాపు 9 నెలలు పడుతుంది. మరి అప్పటివరకు బోయపాటి ఎదురుచూస్తారా.? లేక మరో హీరోతో సినిమా చేస్తారా.? అన్ని చూడాలి. అలాగే బన్నీ స్టార్ డైరెక్టర్ అట్లీ డైరెక్షన్ లో ఓ సినిమా చేయబోతున్నాడు. ప్రస్తుతం షారుక్ ఖాన్ తో సినిమా చేస్తున్న అట్లీ.. అది పూర్తయిన వెంటనే బన్నీ సినిమాను స్టార్ట్ చేయనున్నాడు. మరి ఈ గ్యాప్ లో బోయపాటి సినిమా చేస్తారా లేదా అన్నది చూడాలి.
మరిన్ని ఇక్కడ చదవండి :