Custody: హెడ్ అప్ హై అనే థీమ్‌తో అదరగొట్టిన నాగ్ చైతన్య.. కస్టడీ నుంచి ఫస్ట్ సింగిల్
థాంక్యూ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చైతన్య ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. నాగ చైతన్య, వెంకట్ ప్రభు క్రేజీ కాంబినేషన్‌లో రూపొందుతున్న ప్రతిష్టాత్మక తెలుగు-తమిళ ద్విభాషా చిత్రం 'కస్టడీ'. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది.

అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్య నటిస్తోన్న లేటెస్ట్ మూవీ కస్టడీ. హిట్లు, ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు ఈ యంగ్ హీరో. థాంక్యూ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చైతన్య ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. నాగ చైతన్య, వెంకట్ ప్రభు క్రేజీ కాంబినేషన్‌లో రూపొందుతున్న ప్రతిష్టాత్మక తెలుగు-తమిళ ద్విభాషా చిత్రం ‘కస్టడీ’. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఇప్పటికే సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ఇక రీసెంట్ గా ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను రిలీజ్ చేశారు.
ఈ టీజర్ సినిమా పై అంచనాలను పెంచేసింది. ఈ మూవీలో నాగ్ చైతన్య పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. కెరీర్ లో మొదటి సారి పోలీస్ గెటప్ లో కనిపించనున్నాడు. ఈ సినిమాతో నాగ చైతన్యు హిట్ కొట్టడం ఖాయం అంటున్నారు అక్కినేని ఫ్యాన్స్. ఈ సినిమాలో హీరోయిన్ గా కృతిశెట్టి నటిస్తోంది.
తాజాగా ఈ సినిమానుంచి ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. హెడ్ అప్ హై అనే థీమ్ తో ఈ సాంగ్ కి రిలీజ్ చేశారు. పోలీసు పవర్ ను తెలిపేలా ఈ సాంగ్ ఉంది. ఈ సాంగ్ కి రామజోగయ్య శాస్త్రి శ్రీ శివాని విపీ లెరిక్స్ అందించారు. జానీ మాస్టర్ కొరియోగ్రాఫర్ గా చేశారు. అలాగే యువన్ శంకర్ రాజా ఈ సినిమాకు సంగీతం అందించారు.




మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.