Gudumba Shankar: పవర్ స్టార్ ఫ్యాన్స్ గెట్ రెడీ.. రీరిలీజ్‌కు సిద్దమైన గుడుంబా శంకర్
తాజాగా మరో సినిమా కూడా రీ రిలీజ్ కు రెడీ అవుతుందని తెలుస్తోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన మూడు సినిమాలు ఇప్పటికే రిలీజ్ అయ్యి సంచలనం సృష్టించాయి. పవన్ కళ్యాణ్ నటించిన ఖుషి, జల్సా , తమ్ముడు సినిమాలు రీ రిలీజ్ అయ్యి ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

రీ రిలీజ్‌ల హడావిడి ఈ మధ్య కాలంలో ఎక్కువయ్యాయి. స్టార్ హీరోల సినిమాలు రీ రిలీజ్ అయ్యి కలెక్షన్స్ వర్షం కురిపిస్తున్నాయి. ఇప్పటికే మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్ సినిమాల రీరిలీజ్ అయ్యి మంచి కలెక్షన్స్ సాధించాయి. ఈ క్రమంలోనే త్వరలో ఎన్టీఆర్ సింహాద్రి సినిమాను కూడా రీ రిలీజ్ చేయనున్నారు. ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాను రీ రిలీజ్ చేయనున్నారు. తాజాగా మరో సినిమా కూడా రీ రిలీజ్ కు రెడీ అవుతుందని తెలుస్తోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన మూడు సినిమాలు ఇప్పటికే రిలీజ్ అయ్యి సంచలనం సృష్టించాయి. పవన్ కళ్యాణ్ నటించిన ఖుషి, జల్సా, తమ్ముడు సినిమాలు రీ రిలీజ్ అయ్యి ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
తాజాగా మరో సినిమా కూడా రీ రిలీజ్ అవ్వనుందని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ నటించిన సినిమాల్లో ప్రేక్షకులను, అభిమానులను ఆకట్టుకున్న సినిమా గుడుంబా శంకర్. వీరశంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పుడు రీరిలీజ్ అవుతోందని తెలుస్తోంది.
మణిశర్మ సంగీతం అందించిన ఈ సినిమా సాంగ్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. మీరాజాస్మిన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా త్వరలోనే రీరిలీజ్ అవ్వనుందని తెలుస్తోంది. దాంతో పవర్ స్టార్ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. త్వరలోనే ఈ సినిమా రీరిలీజ్ పై క్లారిటీ రానుంది.




మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.