Agent: అక్కినేని కుర్ర హీరో కోసం రంగంలోకి బాలీవుడ్ హాట్ బాంబ్
చివరిగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సినిమాతో హిట్ అందుకున్నప్పటికీ.. ఆ హిట్ అక్కినేని ఫ్యాన్స్ కు సరిపోలేదు. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మంచి హిట్ గా నిలిచినప్పటికీ.. ఆ హిట్ అక్కినేని అభిమానులకు సరిపోలేదు.

అక్కినేని అఖిల్ హిట్ కోసం చాలా గట్టిగా ప్రయత్నిస్తున్నాడు. వరుసగా సినిమాలు చేస్తున్నప్పటికీ సాలిడ్ హిట్ మాత్రం అందుకోలేక పోతున్నాడు అఖిల్. చివరిగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సినిమాతో హిట్ అందుకున్నప్పటికీ.. ఆ హిట్ అక్కినేని ఫ్యాన్స్ కు సరిపోలేదు. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మంచి హిట్ గా నిలిచినప్పటికీ.. ఆ హిట్ అక్కినేని అభిమానులకు సరిపోలేదు. దాంతో అఖిల్ ఎలాగైనా ఓ సాలిడ్ హిట్ కొట్టాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఈ క్రమంలోనే అఖిల్ ఓ యాక్షన్ ఎంటర్టైనర్‌తో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నాడు. స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు అఖిల్. ఏజెంట్ అనే టైటిల్ తో వస్తోన్న ఈ సినిమా ఓ స్పై థ్రిల్లర్ అని తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమానుంచి విడుదలైన గ్లిమ్స్, పోస్టర్లు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.
తాజాగా ఈ సినిమానుంచి విడుదలైన సాంగ్స్ ప్రేక్షకులను మెప్పించింది. ఇక ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ ఉండనుందట. ఈ సాంగ్ కోసం బాలీవుడ్ హీరోయిన్ ఊర్వశి రౌతేలా రంగంలోకి దింపుతున్నారట. హాట్ బాంబ్ ఊర్వశీ ఇప్పటికే టాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితురాలే..
మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమాలో బాస్ పార్టీ అనే సాంగ్ తో అదరగొట్టింది ఈ చిన్నది. ఇప్పుడు మరోసారి టాలీవుడ్ లో స్పెషల్ సాంగ్ తో మెప్పించనుందట. అఖిల్ తో కలిసి స్టెప్పులేసి అదరగొట్టనుందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ మూవీని ఏప్రిల్ లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. సాక్షి వైద్య ఈ మూవీతో హీరోయిన్ గా టాలీవుడ్ లోకి అడుగుపెడుతుంది. పాన్ ఇండియా లెవల్ లో రిలీజ్ చేస్తున్న సినిమా ఇప్పటికే పలుసార్లు వాయిదా పడుతూ వచ్చింది.ఏప్రిల్ 28న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.




మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి