Naga Chaitanya: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న నాగచైతన్య.. మత్యకారుల కోసం స్వయంగా చేపల పులుసు వండిన అక్కినేని హీరో
అక్కినేని నాగచైతన్య హీరోగా నటిస్తోన్న లేటేస్ట్ మూవీ తండేల్. కార్తీకేయ 2 ఫేమ్ డైరెక్టర్ చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీ వాసు నిర్మిస్తున్నారు. కొన్ని నెలలుగా షూటింగ్ జరుగుతున్న ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 7న అడియన్స్ ముందుకు తీసుకువస్తున్నారు. దీంతో ఈ సినిమా నుంచి పోస్టర్స్, సాంగ్స్ రిలీజ్ చేస్తూ సినిమాపై మరింత ఆసక్తిని క్రియేట్ చేస్తున్నారు మేకర్స్.

అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్య విభిన్న కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తున్నారు. కెరీర్ బిగినింగ్ లో లవర్ బాయ్ గా మెప్పించిన నాగ చైతన్య.. ఇప్పుడు మాస్ హీరోగా మరి సినిమాలు చేస్తున్నారు. వైవిధ్యమైన పాత్రల్లో నటిస్తూ పేక్షకులను అలరిస్తున్నాడు ఈ అక్కినేని అందగాడు. చైతూ కెరీర్ లో ఎన్నో మంచి హిట్స్ ఉన్నాయి. ఏ మాయ చేశావే సినిమా దగ్గర నుంచి శేఖర్ కమ్ముల దర్శకతంలో వచ్చిన లవ్ స్టోరీ వరకు తన నటనతో ప్రేక్షకులను మెప్పించాడు చైతన్య. ఇక ఇప్పుడు తండేల్ సినిమాతో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకోనున్నాడు. చందూ మొండేటి దర్శకత్వంలో నాగచైతన్య నటిస్తున్న లేటెస్ట్ మూవీ తండేల్.
ఈ సినిమా మత్యకారుల నేపథ్యంలో తెరకెక్కుతోంది. యదార్ధసంఘటన ఆధారంగా చందూ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడని తెలుస్తుంది. ఈ సినిమాలో చైతూకి జోడీగా సాయి పల్లవి నటిస్తుంది. ఈ జంటగతంలో లవ్ స్టోరీ సినిమాలో నటించారు.ఇక తండేల్ సినిమా కోసం చైతన్య లుక్ మార్చేశాడు. గుబురు గడ్డంతో మాస్ అవతార్ లోకి మారాడు ఈ లవర్ బాయ్. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్స్ సినిమా పై అంచనాలను పెంచేశాయి. ఎప్పుడెప్పుడు ఈ సినిమా చూద్దామా అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.
తాజాగా నాగ చైతన్య చిత్రయూనిట్ తో పాటు షూటింగ్ స్పాట్ లోని మత్యకారులకు చేపలపులుసు వండి వడ్డించారు. ఇందుకు సంబంధించిన వీడియోను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సినిమా షూటింగ్ చాలా భాగాం ఉత్తరాంధ్రలో జరుగుతుంది. విశాఖపట్నం, శ్రీకాకుళం తీరాల్లోషూటింగ్ చేస్తున్నారు. కాగా విశాఖపట్నంలో చిత్రీకరణ జరుగుతున్నప్పుడు అక్కడి వారి స్టైల్ లో చేపల పులుసు వండుతా అని మాటిచ్చారు చైతన్య. ఇచ్చిన మాట ప్రకారం చేపల పులుసు వండి అక్కడి వారికి వడ్డించాడు చైతన్య. ఈ వీడియో ఇప్పుడు అభిమానులను ఆకట్టుకుంటుంది. ఇక తండేల్ సినిమా వచ్చే నెల 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు రాక్ స్టార్ దేవి ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
మరిన్ని సినిమా వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి








