Akkineni Akhil: నన్ను నమ్మిన వారికోసం బలంగా తిరిగివస్తా.. ‘ఏజెంట్’ రిజల్ట్ పై అఖిల్ రియాక్షన్..
అక్కినేని అఖిల్ ప్రధాన పాత్రలో డైరెక్టర్ సురేందర్ రెడ్డి తెరకెక్కించిన చిత్రం ఏజెంట్. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయిన సంగతి తెలిసిందే. మాస్ యాక్షన్ డ్రామాగా వచ్చిన ఈ మూవీ ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఇందులో మలయాళ స్టా్ర్ మమ్ముట్టి కీలకపాత్రలో నటించారు.

అక్కినేని అఖిల్ ప్రధాన పాత్రలో డైరెక్టర్ సురేందర్ రెడ్డి తెరకెక్కించిన చిత్రం ఏజెంట్. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయిన సంగతి తెలిసిందే. మాస్ యాక్షన్ డ్రామాగా వచ్చిన ఈ మూవీ ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఇందులో మలయాళ స్టా్ర్ మమ్ముట్టి కీలకపాత్రలో నటించారు. ఈ సినిమా కోసం అఖిల్ ఎంతో కష్టపడ్డారు. తన మేకవర్ పూర్తిగా మార్చేశాడు. అప్పటివరకు లవర్ బాయ్ గా కనిపించిన అఖిల్.. ఈసినిమా కోసం సిక్స్ ప్యాక్ బాడీతోపాటు.. మాస్ లుక్ లో కనిపించారు. కానీ ఈ సినిమా ఆడియన్స్ అంచనాలను అందుకోలేకపోయింది. తాజాగా ఏజెంట్ ఫెయిల్యూర్ పై అఖిల్ స్పందించాడు. ఈ క్రమంలో తన అభిమానులను.. ఏజెంట్ చిత్రబృందాన్ని ఉద్దేశిస్తూ ఆయన ఓ నోట్ షేర్ చేశారు.
“ఏజెంట్ సినిమా తెరకెక్కించడంలో తమ జీవితాలను అంకితం చేసిన ప్రతి ఒక్కరికీ నా ధన్యవాదాలు. మేము మంచి సినిమాను అందించేందుకు ఎంతో కష్టపడినప్పటికీ దురదృష్టవశాత్తు మేము అనుకున్నదాన్ని స్క్రీన్‌పైకి తీసుకురాలేకపోయాం. ప్రేక్షకుల అంచనాలను అనుగుణంగా మేము ఈ సినిమాను అందించలేకపోయాం. నాకెంతో అండగా నిలిచిన చిత్ర నిర్మాత అనిల్‌కు కృతజ్ఞతలు.




మా చిత్రాన్ని నమ్మిన డిస్ట్రిబ్యూటర్లు, సపోర్ట్ చేసిన మీడియాకు ధన్యవాదాలు. అభిమానులు, శ్రేయోభిలాషులు ఇస్తున్న ప్రేమ వల్లే నేను కష్టపడి వర్క్ చేస్తున్నా. నాపై నమ్మకం పెట్టుకున్న వారి కోసం మరింత బలంగా మారి తిరిగివస్తాను” అంటూ ఓ స్పెషల్ నోట్ షేర్ చేశారు.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




