Most Eligible Bachelor : అందమైన ప్రేమకథతో ఈ సరి అఖిల్ హిట్ కొట్టేలా ఉన్నాడుగా.. ఆకట్టుకుంటున్న ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ ట్రైలర్..
అక్కినేని యంగ్ హీరో అఖిల్ త్వరలో మోస్ట్ ఎలిజిబుల్ గా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో బుట్టబొమ్మ పూజాహెగ్డే హీరోయిన్..
Most Eligible Bachelor : అక్కినేని యంగ్ హీరో అఖిల్ త్వరలో మోస్ట్ ఎలిజిబుల్‌గా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో బుట్టబొమ్మ పూజాహెగ్డే హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా అఖిల్ కు చాలా ఇంపార్టెంట్. ఇప్పటివరకు చేసిన సినిమాలు వరుసగా ఫ్లాప్ అవ్వడంతో ఈ సినిమా పైనే ఆశలు పెట్టుకున్నాడు అఖిల్. ఇక బొమ్మరిల్లు సినిమా తర్వాత ఆ స్థాయిలో విజయం సాధించలేక పోయాడు భాస్కర్.. దాంతో భాస్కర్ కు కూడా ఈ సినిమా చాలా ఇంపార్టెంట్.. ఈ సినిమా అల్లు అరవింద్ , దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు గోపి సుందర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్దంగా ఉంది. నిజానికి ఈమూవీ ఎప్పుడో ప్రేక్షకుల ముందుకు రావలసింది కానీ కరోన కారణంగా ఆలస్యం అవుతూ వచ్చింది. ఇప్పుడు ఈ సినిమాపైనే మంచి బజ్ క్రియయేట్ అయ్యింది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు టీజర్, పాటలు ఆకట్టుకుంటున్నాయి.
తాజాగా ఈ సినిమానుంచి ట్రైలర్ విడుదల చేశారు చిత్రయూనిట్. ట్రైలర్ సినిమా ఆసక్తిని పెంచింది. ఈ సినిమాలో అఖిల్ చాలా వైవిధ్యమైన పాత్రలో నటించాడని ట్రైలర్ చూస్తుంటే అర్ధమవుతుంది. సినిమాలో అందమైన ప్రేమ కథను చూపించనున్నారు బొమ్మరిల్లు భాస్కర్.. ఇక ఈ సినిమాలో ఈషారెబ్బా మరో కథానాయికగా కనిపించగా, ఆమని ఒక కీలకమైన పాత్రను పోషించారు. ఈ సినిమాతో తనకి తప్పకుండా హిట్ పడుతుందనే నమ్మకంతో అఖిల్ ఉన్నాడు.
మరిన్ని ఇక్కడ చదవండి :