‘పోసాని ఇంటిపై దాడితో తమకు ఎలాంటి సంబంధం లేదు’: తెలంగాణ జనసేన

Posani Vs Janasena: టాలీవుడ్ నటుడు పోసాని కృష్ణమురళీ ఇంటిపై రాళ్ల దాడితో తమకు ఎలాంటి సంబంధం లేదని తెలంగాణ జనసేన ఇంచార్జ్...

'పోసాని ఇంటిపై దాడితో తమకు ఎలాంటి సంబంధం లేదు': తెలంగాణ జనసేన
Janasena
Follow us
Ravi Kiran

|

Updated on: Sep 30, 2021 | 5:43 PM

టాలీవుడ్ నటుడు పోసాని కృష్ణమురళీ ఇంటిపై రాళ్ల దాడితో తమకు ఎలాంటి సంబంధం లేదని తెలంగాణ జనసేన ఇంచార్జ్ నేమూరి శంకర్ గౌడ్ వెల్లడించారు. పవన్ కళ్యాణ్‌పై పోసాని చేసిన అనుచిత వ్యాఖ్యల వెనుక ఏపీ ప్రభుత్వం హస్తం ఉందంటూ ఆయన ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రం నుంచి పోసాని కృష్ణమురళిని బహిష్కరించాలని ధ్వజమెత్తారు. పోసానిపై ఫిర్యాదు చేసినా కూడా పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకోలేదని శంకర్ గౌడ్ విమర్శించారు. తెలంగాణలో ఒక పార్టీ అధ్యక్షడికే రక్షణ లేకపోతే.. భవిష్యత్‌లో సీఎం కేసీఆర్, రేవంత్ రెడ్డి, బండి సంజయ్, అసదుద్దీన్‌లకు కూడా ఇదే జరగొచ్చునని.. పోసానిని కంట్రోల్ చేసే బాధ్యత తెలంగాణ ప్రభుత్వానిదేనంటూ శంకర్ గౌడ్ ఫైర్ అయ్యారు. పవన్ కల్యాణ్ తెల్లకాగితం లాంటివాడని గతంలోనే పోసాని వ్యాఖ్యానించినట్లు గుర్తు చేశారు.

అటు డీసీపీ ఏఆర్.శ్రీనివాస్ మాట్లాడుతూ.. ” నిన్న రాత్రి పోసాని ఇంటిపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. ఆ సమయంలో పోసాని ఆ ఇంట్లో లేరు. ప్రస్తుతం గచ్చిబౌలిలో ఉంటున్నారు. సీసీ కెమెరాలు ఆధారంగా దర్యాప్తు చేస్తున్నాం. ఆ ఇంటి వాచ్‌మెన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశాం. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ దగ్గర కూడా పోసానిపై దాడికి యత్నించారు. పవన్ కళ్యాణ్ అభిమానులుగా గుర్తించాం. ముందస్తుగా అన్నీ చర్యలు తీసుకుంటున్నాం. పంజాగుట్ట ప్రెస్ క్లబ్‌లో జరిగిన సంఘటనపై ఇప్పటి వరకు పోసాని ఫిర్యాదు చేయలేదు. నిన్న ఎస్ఆర్ నగర్‌లో జరిగిన సంఘటనపై కూడా ఫిర్యాదు చేయలేదు. రెండు సంఘటనలపై కూడా విచారణ జరుగుతోంది” అని పేర్కొన్నారు.