Breast Cancer: బ్రెస్ట్ క్యాన్సర్ పై అవగాహన కోసం యూబీఎఫ్ హెల్ప్ లైన్.. ప్రారంభించిన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
బ్రెస్ట్ క్యాన్సర్ మహిళలను చాలా ఇబ్బంది పెట్టే వ్యాధి. ప్రపంచవ్యాప్తంగా చాలామంది మహిళలు దీని బారిన పడుతున్నారు. వారిని రక్షించడానికి వైద్య బృందాలు కష్టపడుతూనే ఉన్నాయి.
Breast Cancer: బ్రెస్ట్ క్యాన్సర్ మహిళలను చాలా ఇబ్బంది పెట్టే వ్యాధి. ప్రపంచవ్యాప్తంగా చాలామంది మహిళలు దీని బారిన పడుతున్నారు. వారిని రక్షించడానికి వైద్య బృందాలు కష్టపడుతూనే ఉన్నాయి. అదేవిధంగా రొమ్ము క్యాన్సర్ గా పిలవబడే ఈ వ్యాధిని నివారించడం కోసం.. దేనిపై అవగాహన కల్పించడం కోసం ప్రపంచవ్యాప్తంగా చాలా సంస్థలు కృషి చేస్తున్నాయి. తెలంగాణా రాష్టం హైదరాబాద్ లో ఉషాలక్ష్మి బ్రెస్ట్ క్యాన్సర్ ఫౌండేషన్ (యూబీఎఫ్) 2007 నుంచి బ్రెస్ట్ క్యాన్సర్ అవగాహన, సహాయం కోసం పనిచేస్తోంది. ఈ సంస్థ రొమ్ము క్యాన్సర్ లేదా రొమ్ము సంబంధిత వ్యాధితో బాధపడుతున్న వారికోసం ”యూబీఎఫ్ హెల్ప్” అనే కార్యక్రమాన్ని తీసుకువచ్చింది. దీనిని భారత ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు గురువారం వర్చువల్ విధానంలో ప్రారంభించారు.
యూబీఎఫ్ హెల్ప్ అనేది జాతీయ స్థాయిలో రొమ్ము క్యాన్సర్ అలాగే రొమ్ము సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారికోసం ఏర్పాటయిన మొట్టమొదటి ఛారిటీ హెల్ప్ లైన్. దీని ద్వారా ఉచిత సేవలు లభిస్తాయి.
ఉషాలక్ష్మి బ్రెస్ట్ క్యాన్సర్ ఫౌండేషన్ (యూబీఎఫ్) వార్షిక సమావేశాల్లో భాగంగా ఈ ప్రత్యెక హెల్ప్ లైన్ ప్రారంభించినట్టు యూబీఎఫ్ వ్యవస్థాపక సీయీవో డైరెక్టర్ డాక్టర్ పి.రఘురాం చెప్పారు. ఇక ఎవరైనా రొమ్ము క్యాన్సర్ తో లేదా రొమ్ము సంబంధిత ఇబ్బందులతో బాధపడుతున్నట్టయితే తమ ఉచిత హెల్ప్ లైన్ నెంబర్ 08046983383 ద్వారా తమను సంప్రదించి సహాయం పొందవచ్చని ఆయన వెల్లడించారు. ఇక తమ వార్షిక సమావేశాల్లో రొమ్ము క్యాన్సర్ ఇబ్బందులను గురించి.. వాటిని ఎదుర్కునే తీరుతెన్నుల గురించి నిపుణులు మాట్లాడతారని వివరించారు.
కాగా, ఐసిఎంఆర్ 2020 నేషనల్ క్యాన్సర్ రిజిస్ట్రీ ప్రోగ్రామ్ రిపోర్ట్ ప్రకారం భారతదేశంలో రొమ్ము క్యాన్సర్ ప్రభావం పెరుగుతోంది. ముఖ్యంగా మెట్రోపాలిటన్ నగరాల్లో 30-40 వయస్సు గల మహిళలు ఎక్కువగా రొమ్ము క్యాన్సర్‌కి గురవుతున్నారు. అవగాహన లేకపోవడంతో రోగ నిర్ధారణకు ఆలస్యమవుతుంది. ఇది మరణాల రేటుకు కారణమవుతుంది. చాలావరకు రొమ్ము క్యాన్సర్ బాధితులను అభివృద్ధి చెందుతున్న దశలో గుర్తించారు. ఈ పరిస్థితికి కారణం అవగాహన లేకపోవడమే. ఇటువంటి అవగాహనా లోపాలను ఎదుర్కునే దిశలో యూబీఎఫ్ కృషి చేస్తోంది. అందుకోసమే ప్రత్యేకమైన హెల్ప్ లైన్ ప్రారంభించింది.
రొమ్ముక్యాన్సర్ లక్షణాలు ఇవీ..
వక్షోజాలపై ఉండే చర్మ కణాల్లో మార్పులు వస్తాయి. ఈ కారణంగా ఛాతిలో నొప్పిగా, అసౌకర్యంగా ఉంటుంది. ఈ లక్షణాలు గనుక ఉంటే బ్రెస్ట్ క్యాన్సర్ ఆరంభంలో ఉన్నట్లు గుర్తించాలి. బ్రెస్ట్ నిపుల్స్ చుట్టూ ఉండే చర్మం పొలుసులుగా మారి రాలిపోతుంటుంది. ఛాతిపై ఉన్న చర్మ రంగు మారుతుంది. శరీరంలోని ఇతర భాగాలపై ఉండే చర్మం కలర్ కన్నా భిన్నంగా ఉంటుంది. ఇది గమనిస్తూ ఉండాలి.
నిపుల్స్‌ని నొక్కితే అవి సరిగా లోపలికి వెళ్లకపోయినా రెండు కూడా డిఫరెంట్ సైజ్‌లలో ఉన్నా కూడా బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్నట్లు అనుమానించాలి. నిపుల్స్ నుంచి తెలుపు, పసుపు, ఎరుపు రంగుల్లో ఏదైనా ద్రవం బయటకు వస్తుంటే అనుమానించాల్సిందే.
కాలర్ బోన్స్, చంకల్లో ఉండే లింఫ్ గ్రాంథుల్లో వాపు ఉంటే బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్నట్లు భావించాలి. రొమ్ములు, చంకల్లో గడ్డలు ఉన్నట్లుగా అనిపించిన అనుమానించాలి. రొమ్ములపై చర్మం ముడతపడడం, గట్టిగా మారడం, రొమ్ములపై గుంటలు, నారింజ పండు రంగులోకి మారితే కచ్చితంగా అనుమానించాల్సిందే.
Also Read: Brain Eating Amoeba: అగ్రరాజ్యంలో మళ్ళీ మెదడు తినే అమీబా వెలుగులోకి.. చికిత్స పొందుతూ మృతి..
American Hospital: ఆస్పత్రిలో ఏడ్చిన యువతి.. సర్జరీ బిల్లుతో పాటు ‘ఎమోషనల్ బిల్లు’ వేసిన సిబ్బంది