AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indians Height: ఎత్తు తగ్గుతున్న భారతీయులు.. సర్వేలో ఆశ్చర్యకర వివరాలు వెల్లడి..

ప్రపంచంలో భారతీయుల సగటు ఎత్తు తగ్గుతోంది. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ఆధారంగా 15-25, 26-50 సంవత్సరాల మధ్య వయస్సు గల భారతీయ పురుషులు, మహిళల ఎత్తును పరిశీలిస్తే విషయం తెలిసింది..

Indians Height: ఎత్తు తగ్గుతున్న భారతీయులు.. సర్వేలో ఆశ్చర్యకర వివరాలు వెల్లడి..
Hight
Srinivas Chekkilla
| Edited By: Anil kumar poka|

Updated on: Sep 30, 2021 | 7:56 PM

Share

ప్రపంచంలో భారతీయుల సగటు ఎత్తు తగ్గుతోంది. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ఆధారంగా 15-25, 26-50 సంవత్సరాల మధ్య వయస్సు గల భారతీయ పురుషులు, మహిళల ఎత్తును పరిశీలిస్తే విషయం తెలిసింది. ప్రజారోగ్యం యొక్క ప్రాథమిక సూచికల్లో ఎత్తు కూడా ఒకటి. ప్రపంచవ్యాప్తంగా సగటు ఎత్తుల మొత్తం పెరుగుదల నేపథ్యంలో భారతదేశంలో సగటు ఎత్తు క్షీణించడం ఆందోళనకర విషయం. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే(NFHS) “1998 నుంచి 2015 వరకు భారతదేశంలో వయోజన ఎత్తుపై అధ్యయనం చేశారు. కృష్ణ కుమార్ చౌదరి, సాయన్ దాస్, సెంటర్‌ ఆఫ్ సోషల్ మెడిసిన్ అండ్ కమ్యూనిటీ హెల్త్, జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం వారు 1998-99, 2005-06, 2015-16లో సేకరించిన డేటా ఆధారంగా సగటు ఎత్తు తగ్గితున్నట్లు గుర్తించారు. తాజాగా (2019-20) 6 లక్షల ఇళ్లలో సర్వే చేశారు. 15-25 మధ్య మహిళలు వారి సగటు ఎత్తు 0.12 సెం.మీ., 26-50 మధ్య మహిళలు 0.13 సెం.మీ. ఉండగా.. 15-25 మధ్య పురుషులు వారి సగటు ఎత్తులో 1.10 సెం.మీ, 26-50 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారు 0.86 సెం.మీ. గా ఉంది. NFHS-II, NFHS-III సర్వేల మధ్య, 15-25 సంవత్సరాల మధ్య వయస్సు గల మహిళలు వారి సగటు ఎత్తు 0.84 సెం.మీ పెరిగింది.

NFHS-III,NFHS-IV సర్వే ప్రకారం 15-25 సంవత్సరాల వయస్సు గల మహిళల సగటు ఎత్తు 0.42 సెం.మీ.లు తగ్గగా, పేద మహిళలు 0.63 సెం.మీగా ఉంది. 26-50 సంవత్సరాల వయస్సులో పేద వర్గానికి చెందిన మహిళలు వారి సగటు ఎత్తులో0.57 సెం.మీ గణనీయమైన క్షీణతను చూశారు. పట్టణ ప్రాంతాల నుంచి వచ్చిన మహిళల సగటు ఎత్తు 0.20 సెం.మీ మేర మెరుగుపడగా, గ్రామీణ మహిళలు 0.06 సెం.మీ మాత్రమే పెరిగారు. పట్టణ ప్రాంతాల నుంచి 26-50 సంవత్సరాల మధ్య వయస్సు గల పురుషులు సగటు ఎత్తులో అత్యంత క్షీణతను చూశారు. కర్ణాటకలో అత్యధికంగా 2.04 సెం.మీ క్షీణత కనిపించింది.

ఎత్తు జన్యు, వంశపారపర్యంగా ఉన్నప్పటికీ పోషకాహారం, పర్యావరణం కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఎక్కువ మంది పిల్లల్ని కన్న, వారిని సరిగా పోషణ అందించకోపోయినా ఎత్తుపై ప్రభావం చూపుతోంది. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల వర్గాల ప్రజలు సగటున. ఇతర కులాలకు చెందిన వారి కంటే తక్కువగా ఉంటారు. ప్రపంచ బ్యాంకు అంచనాల ప్రకారం ఎత్తు లేకపోవటం కాఆర్థిక ఉత్పాదకతలో 1.4% నష్టానికి దారితీస్తుందట. పరిశ్రమ సంస్థ అసోచామ్, కన్సల్టెన్సీ సంస్థ ఈవై అధ్యయనం ప్రకారం, పౌరులు పోషకాహార లోపంతో భారతదేశం ప్రతి సంవత్సరం స్థూల జాతీయోత్పత్తిలో 4% కోల్పోతోంది. 2020 గ్లోబల్ హంగర్ ఇండెక్స్ ప్రకారం 107 దేశాల్లో భారత్ 94 స్థానంలో ఉంది. NHFS-V (2019-’20) ప్రకారం, 22 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల మొదటి దశ డేటాను విడుదల చేశారు. గత నాలుగు సంవత్సరాల్లో పది ప్రధాన రాష్ట్రాలలో తక్కువ బరువున్న పిల్లల సంఖ్య పెరిగింది. 2020-21లో కోవిడ్ మహమ్మారి ప్రజారోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేసింది. జీన్ డ్రోజ్, అన్మోల్ సోమంచి నిర్వహించిన సర్వేలో 53% -77% మంది ప్రజలు కరోనా సమయంలో తక్కువు ఆహారం తీసుకున్నారని తేలింది.

Read Also.. Viral Video: నీటిలో తేలుతున్న శవం.. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులకు ఫ్యూజులు ఔట్.. ఏం జరిగిదంటే..