పోస్టు కోవిడ్ లక్షణాలపై సర్వే.. కరోనా సోకి తగ్గినా.. మెదడుపై ఎఫెక్ట్.. వీడియో
ఏడాదిన్నర కాలంగా ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా మహమ్మారి ఇప్పుడిప్పుడే సద్దుమణుగుతోంది. అయితే దాని ప్రభావం మాత్రం ప్రమాదకరంగా మారుతోందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.
ఏడాదిన్నర కాలంగా ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా మహమ్మారి ఇప్పుడిప్పుడే సద్దుమణుగుతోంది. అయితే దాని ప్రభావం మాత్రం ప్రమాదకరంగా మారుతోందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. కరోనా సోకి తగ్గినవారిలో పైకి ఎలాంటి లక్షణాలు కనిపించకపోయినా.. అంతర్గతంగా అవయవాల పనితీరును దెబ్బతీస్తోందని, మెదడుపైనా ప్రభావం చూపుతోందని తాజాగా గుర్తించారు. కరోనా వచ్చి తగ్గిపోయాక బాధితులు చిన్న విషయాలకే ఆందోళన చెందడం, డిప్రెషన్, మతిమరుపు, గందరగోళానికి లోనవడం లాంటి లక్షణాలు కనిపిస్తున్నట్టు తేల్చారు. 45 నుంచి 50 ఏళ్లు పైబడిన వారిలో ఈ సమస్య ఎక్కువగా ఉన్నట్టు గుర్తించారు. తమకు ఏదైనా అవుతుందేమోనన్న భయం, కరోనాతో ఉపాధి కోల్పోయి ఆర్థికపరమైన సమస్యలు తలెత్తడం వంటివి ఈ మానసిక సమస్యలకు కారణమన్న నిర్ధారణకు వచ్చారు.
మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: సాండ్‌విచ్ తినడానికి హోటల్‌కి వెళ్లిన కస్టమర్‌కి ఊహించని షాక్.. ఆర్డర్ చూసి ఫ్యూజులు ఔట్.. వీడియో
Samantha: సమంతపై బాలీవుడ్ హీరో షాకింగ్ కామెంట్స్.. వీడియో