Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Brain Eating Amoeba: అగ్రరాజ్యంలో మళ్ళీ మెదడు తినే అమీబా వెలుగులోకి.. చికిత్స పొందుతూ మృతి..

Brain Eating Amoeba: మనవాళిపై వైరస్ లు ప్రగబట్టినట్లు ఉన్నాయి.. ఏడాదిన్నర నుంచి కరోనా వైరస్ రకరకాల రూపాలను సంతరించుకుని కల్లోలం సృష్టిస్తూనే ఉంది. కోవిడ్..

Brain Eating Amoeba: అగ్రరాజ్యంలో మళ్ళీ మెదడు తినే అమీబా వెలుగులోకి.. చికిత్స పొందుతూ మృతి..
Brain Eating Amoeba
Follow us
Surya Kala

|

Updated on: Sep 30, 2021 | 11:58 AM

Brain Eating Amoeba: మనవాళిపై వైరస్ లు ప్రగబట్టినట్లు ఉన్నాయి.. ఏడాదిన్నర నుంచి కరోనా వైరస్ రకరకాల రూపాలను సంతరించుకుని కల్లోలం సృష్టిస్తూనే ఉంది. కోవిడ్ సరికొత్త వేరియంట్ ఆర్. 1 వెలుగులోకి అనే వార్తల నుంచి ప్రజలు ఇంకా తేరుకోక ముందే.. మరొక సూక్ష్మజీవి ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తుంది. అమీబా నెగ్లేరియా ఫోవ్‌లేరి.. అమీబా జాతికి చెందిన సూక్ష్మజీవి అగ్రరాజ్యం అమెరికాలో మళ్ళీ వెలుగులోకి వచ్చింది.  ఈ వైరాస్ శరీరంలోని మెదడుపై అటాక్ చేసి.. వ్యాధి గురించి తెలియకముందే ప్రాణాలను హరిస్తూ.. ప్రజలను వణికిస్తోంది.

అమెరికాలోని టెక్సాస్‌లో అరుదైన మెదడు తినే అమీబా బారిన పడిన ఏడేళ్ల చిన్నారి బాలుడు మరణించాడు. దీనికి కారణం ఆర్లింగ్టన్ డాన్ మిసెన్‌హైమర్ పార్క్‌ లోని నీటి నాణ్యత లోపమే నని .. ఈ విషయం తమ పరీక్షలో తేలిందని అధికారులు చెప్పారు. మృతుడు పార్క్ లో ఆడుకుంటున్న సమయంలో అక్కడ ఉన్న నీరు బాలుడిపై పడిందని.. ఆ నీటిద్వారా అమీబా నెగ్లేరియా ఫోవ్‌లేరి సూక్ష్మ జీవి ఆ బాలుడి మెదడులోకి ప్రవేశించిందని వైద్యులు తెలిపారు.

బాలుడు తలనొప్పి, వాంతులు వంటి లక్షణాలతో ఇబ్బంది పడుతుంటే తల్లిదండ్రులు ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం చేర్పించారు. పరీక్ష చేసిన వైద్య సిబ్బంది బాలుడి శరీరంలోకి బ్రేయిన్-ఈటింగ్ అమిబా ప్రవేశించినట్టు  చెప్పారు. చికిత్స పొందుతూ.. బాలుడు మరణించాడు. అయితే సెప్టెంబర్ 5న అరుదైన ఇన్ఫెక్షన్ కారణంగా పిల్లలు ఆసుపత్రిలో చేరినట్లు కూడా అధికారులు గుర్తించారు. వెంటనే ఆరోగ్య శాఖ అధికారులు   దర్యాప్తు ప్రారంభించారు.  నగరంలోని పబ్లిక్ స్ప్లాష్ ప్యాడ్‌లన్నింటినీ మూసివేశారు. వ్యాధి నియంత్రణ అధికారులు పార్క్ నుంచి సేకరించిన నీటిలో అమీబా ఉన్నట్లు నిర్ధారించారు. దీంతో కలుషితమైన నీరు ముక్కు ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తే.. అమీబా నెగ్లేరియా ఫోవ్‌లేరి సోకి.. మరణిస్తారని వైద్యులు చెబుతున్నారు. సురక్షితమైన నీటిలో ఉండాలని.. వేడి నీటిని తాగాలని సూచిస్తున్నారు.

ఈ అమీబా నెగ్లేరియా ఫోవ్‌లేరి సూక్మజీవి సాధారణంగా కాల్వలు, చిన్ని చిన్న మురికి గుంటలు, అపరిశుభ్ర స్విమ్మింగ్‌ పూల్స్‌, తాగునీటి కుళాయిల వద్ద ఉంటాయి. తాజాగా చనిపోయిన పిల్లాడికి కూడా పార్క్ లోని నీటి ద్వారా సోకినట్లు తెలుస్తోంది. గార్డెన్‌లో ఆడుకుంటుండగా స్ప్రింక్లర్‌లోని నీరు బాలుడిపై పడి వ్యాధి వచ్చినట్టు అధికారులు చెబుతున్నారు.  ఈ సూక్మజీవి ముక్కు ద్వారా శరీరంలోపలికి ప్రవేశించి నేరుగా మెదడుకు చేరుతుందని.. తర్వాత మెల్లగా తన ప్రభావం చూపిస్తుందని.. అమీబా నెగ్లేరియా ఫోవ్‌లేరి సోకినవారిలో తలనొప్పి, వాంతులు, అలసట వంటి లక్షణాలు ఉంటాయని చెబుతున్నారు. ఇది జాగ్రత్త తీసుకుంటే ప్రమాదకరమైంది కాదని.. కనుక వేడినీటి తాగాలని.. పరిశుభ్రమైన నీటిని ఉపయోగించాలని సూచిస్తున్నారు.

Also Read:  సీఫుడ్ లవర్స్ కోసం.. ఆంధ్ర స్టైల్‌లో అమ్మమ్మకాలం నాటి రొయ్యల మసాల కూర తయారీ..